Health

లో దుస్తులను వాష్ చేయకుండా మళ్ళీ వాడుతున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

పరిశుభ్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. చిన్నారులకు ఉపయోగించే పొత్తిగుడ్డలు, పక్క బట్టలు, వారు వేసుకునే దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక వేళ ఏమాత్రం శుభ్రపర్చకుండా పదేపదే వాడిని బట్టలనే వాడటం వల్ల చర్మ సంబంధిత ఇన్ ఫెక్షన్లు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే చాలా మంది లో దుస్తుల గురించి మాట్లాడటానికి గానీ, వాటిని చూసి కానీ ఏదో ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన శరీరంలో ఇవే ముఖ్యమైన దుస్తులు.

వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చాలా ప్రమాదం. వీటిని రెగ్యులర్ గా వాష్ చేయాలి. అలా ఉతికినవే వాడుతూ ఉండాలి. ఉతకకుండా వాడితే చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం. అందులోనూ ప్రస్తుతం వర్షాకాలం. ఈ కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరవు. అందులోనూ రెండు, మూడు రోజులకోసారి ఎండను చూసి ఉతుకుతూ ఉంటారు. దీంతో ఆల్రెడీ వాడినదే మళ్లీ కొంత మంది వాడుతూ ఉంటారు.

అయితే అలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దుర్వాసన.. మందికి ప్రైవేట్ పార్ట్స్ వద్ద దుర్వాసన వస్తూ ఉంటుంది. లో దుస్లుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియా, చెమట కారణంగా ఈ వాసన వస్తుంది. కాబట్టి లో దుస్తులను క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఉతికినవి ధరిస్తే ఈ దుర్వాసన రాదు. ఇన్ ఫెక్షన్స్.. ఉతకని లో దుస్తుల్లో క్రిములు బాగా పెరుగుతాయి. ఎందుకంటే మన చెమట, మూత్ర కణాలు అనేవి దాన్ని అతుక్కుని ఉంటాయి.

దీని వల్ల బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. చెమట, నీరు నిలిచిపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ లో మూత్రం నిలిచిపోతుంది. ఇది ఈస్ట్ ఇన్ ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. తడిగా ఉన్నవి వేసుకోకూడదు..తడిగా ఉన్న లో దుస్తులు అస్సలు వాడకూడదు. ఇది ఇన్ ఫెక్షన్ ని పెంచడమే కాకుండా.. ఈస్ట్ ఇన్ ఫెక్షన్స్ కి దారి తీస్తుంది. ఇది లైంగికంగా కూడా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

కాబట్టి రెగ్యులర్ గా లో దుస్తులను వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కగా ఆరిన వాటినే యూజ్ చేయాలి. ఉతికిన తర్వాత వాటిని ఎండలో ఆరబెడితే మంచిది. పరిశుభ్రత పాటించాలి..ఓ సారి వాడిన ఇన్నర్ వేర్స్ మళ్లీ మళ్లీ వాడకూడదు. దీంతో చర్మ సమస్యలు వస్తాయి. దీంతో ప్రైవేట్ పార్ట్స్ లో మొటిమలు, ఉత్సర్గాలకు కారణం అవుతంది. అందుకే ప్రతీ ఒక్కరూ క్లీన్ ఉండే లో దుస్తులనే వాడటం బెటర్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker