News

సీరియల్స్‌లో పద్దతిగా ఉండే ఈ నటి, బయటకు వస్తే మాత్రం సెగలు పుట్టించేలా..!

సినిమాల్లో , సీరియల్స్ లో నటించే వారు..తెరపై ఒకలా బయట మరోలా ఉంటారు. సినిమా, సీరియల్స్ కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తుంటారు. ముఖ్యంగా చూసినట్లు అయితే సీరియల్స్ లో నటించావారు ఎంతో హుందాగా,పద్దతిగా అచ్చమైన తెలుగింటి ఆడబిడ్డల కనిపిస్తుంటారు. చీర, లంగావోణిల్లో ఎంతో చక్కగా కనిపిస్తుంటారు. అయితే ఇలాంటి నటీమణుల్లో కొందరు బయట మాత్రంచ లా గ్లామరస్ గా కనిపిస్తుంటారు.అ అలానే ఇటీవలి కాలంలో వెండితెరపై నటీమణులకు అభిమానుల నుంచి ఎంత ఆదరణ లభిస్తుందో, బుల్లితెర సెలబ్రిటీలకు కూడా అంతే స్థాయిలో ఆదరణ పొందుతున్నారు.

సోషల్ మీడియాలో వారికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు సీరియల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. బుల్లితెరపై ఈమె ఎంతో పద్దతిగా, ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు మధుమిత. ఈ అమ్మడికి హీరోయిన్ల రేంజ్ లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో దాదాపు 6లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. కన్నడ ఇండస్ట్రీలో సీరియల్స్ తో ఇండస్ట్రీకి మధుమిత ఎంట్రీ ఇచ్చింది. నాట్యం అంటే మధుమితకు ప్రాణం. చిన్నప్పటినుంచీ ఎంతో బాగా నాట్యం చేసేది. భరతనాట్యంతో ఇంటా బయటా అందరి ప్రశంసలు పొందుతూ, వెస్ట్రన్‌ డాన్స్‌ కూడా నేర్చుకుంది. ముఖంలో అద్భుతమైన హావభావాలు పలికిస్తూ, తన నాట్యంతో అందరినీ ఆశ్చర్యపరిచేది.

‘‘నువ్వు మంచి నటి అవుతావు. నీకు మంచి భవిష్యత్‌ ఉంది’’ అని ఆమె నాట్య గురువు ప్రోత్సహించేవారట. అప్పటినుంచీ నటి కావాలని ఒక బలమైన కోరిక ఆమెలో నాటుకుపోయింది. కాలేజీ స్థాయిలో ఎంతోమంది స్నేహితుల్ని సంపాదించుకుంది. స్కూల్లో నాటికలు, నాట్యం, ఇతర సాంస్కృతిక పోటీల్లో చురుగ్గా పాల్గొంటూ ఎన్నో బహుమతులు పొందేది. బీకాం గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker