సినిమాలు లేకున్నా.. భారీగా సంపాదిస్తున్న హీరోయిన్, ఎలానో తెలుసా..?
తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించిన ప్రీత నరసింహ చిత్రంలో రజనీకాంత్ కూతుర్లలో ఒకరిగా నటించి పాపులర్ అయ్యారు. ఆ తరువాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, చందు, వంటి చిత్రాల్లో నాయకిగా నటించారు. అయితే ఒకప్పుడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ హీరోయిన్ ప్రీతా విజయ్ కుమార్ అందరికీ సుపరిచితమే. సినీ నేపథ్యమున్న కుటుంబానికి చెందిన ప్రీతా విజయ్ కుమార్ రుక్మిణీ మూవీ ద్వారా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ ముద్దుగుమ్మ యాక్టర్ విజయ్ కుమార్, మంజుల దంపతుల కూతురు. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరమైన ప్రీతా విజయ్ కుమార్ టాప్ హీరోయిన్ల రేంజ్ లో సంపాదిస్తుంది. సినిమాల్లోనే కాదు ఇతర రంగాల్లో కూడా కళ్లు చెదిరే ఆదాయాన్ని పొందొచ్చని నిరూపిస్తున్నది. కాగా సినిమాలకు విరామం పలికి 2002లో దర్శకుడు హరిని పెళ్లి చేసుకుంది ప్రీతా విజయ్ కుమార్. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే మరో పక్క బిజినెస్ లోను రాణిస్తుంది ఈ అమ్మడు.
వ్యాపారంలోకి అడుగుపెట్టిన ప్రీతా విజయ్ కుమార్ చెన్నైలో ప్రీత ప్యాలెస్ పేరుతో కల్యాణ మండపాన్ని నిర్మించారు. దీనితో పాటు మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు. మద్రాస్ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఇచ్చింది నటి ప్రీతా విజయ్ కుమార్. ఇదేగాక సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోను కూడా నిర్వహిస్తున్నారు. వీటన్నింటి ద్వారా హీరోయిన్ ప్రీతా విజయ్ కుమార్ భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు.
సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ వ్యాపారం ద్వారా నెలకు లక్షల్లో ఆదాయాన్ని పొందుతూ టాప్ హీరోయిన్లతో పోటీపడుతున్నారు. ఇక ప్రీతా విజయ్ కుమార్ నటించిన సినిమాల విషయానికొస్తే.. రుక్మిణీ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు వంటి చిత్రాల్లో నటించింది మెప్పించింది.