News

Mahalakshmi: పెళ్లైన 2ఏళ్లకే భర్తతో హీరోయిన్ విడాకులు, మహాలక్ష్మి ఏం చేయబోతుందో తెలుసా..?

మహాలక్మీ.. ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్‏ను ఆమె వివాహం చేసుకోవడం సౌత్ ఇండియాలో ఆమె పేరు మారుమోగింది. అప్పటికే భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. నిర్మాత రవీందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశగా మారింది. ఇక వీరి పెళ్లి తర్వాత మహాలక్మీ జంటపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా తన భర్తతో కలిసి ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తూ సంతోషంగా గడుపుతుంది. ఈ జంట నిత్యం వార్తలలో నిలుస్తుంటారు.

అయితే మహాలక్ష్మి శంకర్ తమిళ సినీ ప్రముఖ నటి. మహాలక్ష్మి అప్పటి వరకు ఓ సాధారణ నటిగా ఉన్న ఈమె రెండో పెళ్లి తర్వాత వార్తల్లో నిలిచింది. నిర్మాత రవీంద్ర చంద్రశేఖరన్‌ను మహాలక్ష్మి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. వీరి పెళ్లి సమయంలో నిర్మాత రవీంద్ర లావుగా ఉండటం కారణంగా నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. డబ్బు కోసమే మహాలక్ష్మి నిర్మాతను రెండో పెళ్లి చేసుకుందని కామెంట్స్ కూడా చేశారు. అలాంటి వార్తల్ని పట్టించుకోని మహాలక్ష్మి, రవీంద్రతో కలిసి సంతోషంగా జీవించింది.

అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయని చిత్రపరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. గతంలో పెళ్లయిన మహాలక్ష్మి విడాకుల తర్వాత రవీంద్ర చంద్రశేఖరన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత మహాలక్ష్మి తరచూ వారిద్దరి రొమాంటిక్ ఫోటోలను పంచుకునేది. రవీంద్ర చంద్రశేఖర్ మాత్రం తన మాజీ భార్యతో ఫోటోలను షేర్ చేయలేదు. రవీంద్ర చంద్రశేఖరన్ ఒంటరిగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు.

నాలో నేను ఏదో మిస్ అయ్యాను అని కూడా రాశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. రవీంద్ర మహాలక్ష్మితో దూరంగా ఉంటున్నారనే అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా ఈ జంట ఎక్కడికి వెళ్లినా ఆ జంట ఫొటోలను షేర్ చేసేవారు. అయితే తాజాగా రవీంద్ర చంద్రశేఖరన్ తాను ఒంటరిగా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ బోరింగ్ అని ఒక్క లైన్ కామెంట్ రాయడంతో విడాకుల పుకార్లకు దారితీసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker