గులాబి హీరోయిన్ మహేశ్వరి గుర్తుందా..! ఇప్పుడెం చేస్తోంది, ఆమె ఫ్యామిలీని చూశారా.?
1998లో నీకోసం చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది. ఇక్కడ మరో విషయం ఏమంటే మహేశ్వరి నటి శ్రీదేవికి అక్క సూర్యకళ కుమార్తె అని చాలా మందికి తెలియదు. ఇక మహేశ్వరి తన 16వ యేట 1994లో భారతీరాజా దర్శకత్వంలో వెలువడిన తమిళ సినిమా కరుత్తమ్మలో తొలిసారిగా నటించింది. తెలుగులో ఈమె మొదటి సినిమా గులాబి. అయితే 90’sలో తెలుగులో స్టార్ హీరోయిన్గా విపరీతమైన పాపులారిటీని తెచ్చుకుంది.
ఇలా టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో మహేశ్వరి ఒక్కసారిగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్, విక్రమ్ లాంటి అగ్ర నటుల సరసన నటించింది మహేశ్వరి. అలాగే పెళ్లి తర్వాత 2012లో జీ తెలుగులో ‘మై నేమ్ ఈజ్ మంగతాయారు’ అనే సీరియల్లో నటించింది. ఇది అప్పట్లో బుల్లితెరపై పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ఇక తెలుగులో మహేశ్వరి చివరిగా ‘తిరుమల తిరుపతి వెంకటేశ’ చిత్రంలో కనిపించింది.
2008లో జయకృష్ణ అనే బిజినెస్‌మాన్‌ను పెళ్లి చేసుకున్న మహేశ్వరి.. అతిలోక సుందరి శ్రీదేవికి కజిన్ సిస్టర్. ఇప్పటిదాకా ఫ్యాన్స్‌కు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. కాగా, మహేశ్వరి ప్రస్తుతం జాన్వి కపూర్‌కు తోడుగా ఉంటున్నారని తెలుస్తోంది. అలాగే ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నారని సమాచారం.