Health

మైదా పిండితో చేసిన పదార్దాలు తింటే మీ శరీరంలో ఏమౌతుందో తెలుసా.. ?

మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమ పిండి. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని అజో డై కార్బొనమైడ్ , క్లోరిన్ వాయువు, బెంజైల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. అయితే ఈ తెల్ల పిండిని భారతీయులకు ఇటాలియన్లు తొలిసారిగా పరిచయం చేశారు. ఈ పిండిని గోధుమల నుంచి తయారు చేసినప్పటికీ ఎక్కువగా ఫిల్టర్‌ చేసి, రసాయనాలు కలుపుతారని సమాచారం. అయితే 5,000 ఏళ్ల క్రితం ఈజిప్టులో మైదా పిండిని మొదటిసారిగా తయారు చేశారు.

అక్కడి ప్రజలు ఈ పిండిని తయారు చేసేందుకు అనేక విధాలు కష్టపడ్డారు. వారు ముందుగా A1 క్వాలిటీ గోధుమలు తీసుకుని వాటిని పిండిలా తయారు చేసి..బాగా శుద్ధి చేసేవారట. ఇలా తయారు చేయడానికి దాదాపు 10 నుంచి 14 రోజుల పాటు సమయం పట్టేదని సమచారం. అయితే ఈ పిండిని ఎక్కువగా ఈజిప్టు రాజు భోజనం తయారికి వినియోగించేవారు. ఈ తెల్ల పిండితో అప్పట్లో ఎన్నో వంటకాలు చేసేవారట. అయితే క్రమంలో ఈ పిండిని ప్రజలు కూడా తయారు చేసుకోవడం మొదలు పెట్టడంతో..అందరికీ అందుబాటులోకి వచ్చింది.

మైదాను తయారు చేయడానికి అందరు రెండు పద్ధతులు పాటిస్తారు. మొదటగా గోధుమలను పిండిలా తయారు చేసి దానిని ప్రాసెస్ చేస్తారు. ఇలా కొన్ని రోజుల పాటు ప్రాసెస్‌ చేసి బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని కలుపుతారు. అంతేకాకుండా ఈ పిండిలో అలోక్సాన్ రసాయాన్ని కూడా మిక్స్‌ చేస్తారు. ఈ రెండు రసాయనాలను కలపడం వల్ల మైదా చివరి దశకు చేరుకుంటుంది. అయితే ఈ రెండు రసాయనాలను ఎక్కువగా హెయిర్ డైలలో వినియోగిస్తూ ఉంటారు.

ఇలా వీటన్నింటితో తయారు చేసిన తెల్ల పిండిని ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతకంగానూ మరే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు మైదా తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఇందులో బాడీకి కావాల్సిన పోషకాలు, విటమిన్స్‌ ఏవి ఉండవు..కాబట్టి వీటితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల ఎలాంటి యూజ్‌ ఉండదు. అంతేకాకుండా గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి.

కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ తెల్ల పిండి ప్రతి రోజు తింటే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలకు ప్రతి రోజు పిల్లలకు ఆహారంగా ఇవ్వడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల వస్తాయి. అంతేకాకుండా మెదడుపై చెడు ప్రభావం పడి ఆలోచన సమర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గి పోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెద్దవారిలో అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెల్ల పిండితో తయారు చేసిన ఆహారాలు తినకపోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker