Health

ఈ చిన్న పని చేస్తే మీరు పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జరుకుంటారు.

నిద్ర రాకపోవడం అనేది ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది. ఎంత ట్రై చేసినా కొంతమందికి నిద్రపట్టదు. దీనితో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటి నుంచి బయపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. నిద్రపట్టకపోవడం అనేది అలానే కొనసాగితే.. చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. అయితే నిద్రలేమితో బాధపడే వారి ముఖంలో ఉత్సాహం, ఉల్లాసం కనిపించకపోగా.. లోలోపలే ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. అందుకే మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్రలేమి.. నిద్రలేమికి ఎన్నో కారణాలు ఉంటాయి.

కానీ చాలామందిలో నిద్రలేమికి కనిపించే సాధారణ కారణం మాత్రం ఒక సరైన రెగ్యులర్ స్లీపింగ్ రొటీన్ అనేది లేకపోవడమే. పడుకోవాల్సిన సమయంలో పడుకోకుండా సమయం దొరికినప్పుడే పడుకోవడం… లేదా ఒక సమయం పాటించకపోవడం నిద్రలేమి సమస్యకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే ప్రతీ రోజు రాత్రి త్వరగా అన్ని పనులు ముగించుకుని పడుకోవడం, తెల్లవారిజామున ఒకే సమయానికి నిద్ర లేవడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి.

అలా కొంతకాలం ఎక్సర్‌సైజ్ చేయగలిగితే.. ఆ తరువాత ఆ సమయానికి నిద్రపట్టడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. బెడ్ రూమ్‌లో ఉండే వాతావరణం..ఈజీగా నిద్రపట్టడానికి బెడ్ రూమ్‌లో ఉండే వాతావరణం అనేది చాలా ముఖ్యం. ఎక్కువ లైట్ల వెలుతురు లేకుండా డార్క్, ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండేలా మీ బెడ్ రూమ్‌ వాతావరణం ఉండేలా చూసుకోండి. అప్పుడే మీకు ఈజీగా నిద్రపడుతుంది.

స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్, కంప్యూటర్స్..స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్, కంప్యూటర్స్ నుంచి ఒక రకమైన బ్లూ లైట్ కిరణాలు వెలువడతాయి. అవి మీ కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే రాత్రి వేళ పడుకోవడానికంటే కనీసం ఒక గంట ముందు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని వినియోగించడం ఆపేయాలి. శరీరానికి, మనసుకు హాయినిచ్చే హెల్తీ హ్యాబిట్స్..ప్రతీ రోజూ పడుకోవడానికి ముందుగా శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే కొన్ని అలవాట్లు చేసుకోవాలి.

పుస్తక పఠనం మంచి అలవాటు కనుక నచ్చిన పుస్తకాలు చదవడం చేయొచ్చు. లేదంటే గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేసి రిలాక్స్ అవడం, ధ్యానం చేయడం, డైరీ రాసుకోవడం వంటివి చేయొచ్చు. బెస్ట్ మ్యాట్రెస్ ఎంపిక..నిద్ర సుఖం ఎరుగదు అనేది ఎంత వాస్తవమో.. సుఖమైన నిద్ర కోసం సౌకర్యవంతమైన మ్యాట్రెస్ కూడా అంతే ముఖ్యం. అందుకే కంఫర్టబుల్ మ్యాట్రెస్‌ని ఎంపిక చేసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker