News

గగన్‍‏యాన్ వ్యోమగామిని రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి. పెళ్లైన 40 రోజుల్లోనే..?

మలయాళ నటి లీనా.. ‘ప్రధాని మోదీ తొలి “ఆస్ట్రోనాట్ వింగ్స్”ను ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలెట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ కు అమర్చారు. ఇది దేశానికి, కేరళకు, వ్యక్తిగతంగా నాకు గర్వించే విషయం. ఇప్పటివరకూ రహస్యంగా ఉంచిన విషయం.. జనవరి 17న అతికొద్దిమంది మధ్య ప్రశాంత్ ను పెళ్లి చేసుకున్నా. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ విషయాన్ని చెప్పేందుకు ఇంతకంటే మంచి సమయం లేదనుకుంటున్నా’ని చెప్పుకొచ్చింది.

అయితే పెళ్లైన 40 రోజుల తర్వాత తమ వివాహం గురించి అధికారికంగా అనౌన్స్ చేశారు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న లీనా.. కొన్నాళ్లుగా ఒంటరిగానే ఉంది. ఈ ఏడాది జనవరి 17న ప్రముఖ ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలకృష్ణన్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. ఇటీవల కేరళలో పర్యటించిన మోదీ గగన్‍‏యాన్ ప్రాజెక్టులో నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు.

అందులో పైలట్ కెప్టెన్ ప్రశాంత్ మొదటి వ్యక్తి. ప్రధానీ మోదీ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన వెంటనే లీనా తన పెళ్లి గురించి బయటపెట్టింది. దీంతో వీరికి సెలబ్రెటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “ఇండియన్ మొదటి వ్యోమగామిగా ప్రశాంత్ బాలకృష్ణన్ పేరును మోదీజీ ప్రకటించారు. ఇది మన దేశానికీ.. కేరళ రాష్ట్రానికి ఒక హిస్టారిక్ మూమెంట్..ముఖ్యంగా నాకు ఇది ఎంతో సంతోషకరమైన సందర్భం.

ఎందుకంటే ఈ సందర్భంలో ఒక రహస్యం తెలియజేయడం కోసం నేను ఎంతగానో ఎదురుచూసాను. జనవరి 17న 2024న నేను ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ వివాహం చేసుకున్నాను. అది ఇప్పుడు అధికారికంగా మీకు తెలియజేస్తున్నాను” అంటూ ఇన్ స్టాలో షేర్ చేసుకుంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోస్ పంచుకుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker