News

30ఏళ్లుగా చిరంజీవికి డూప్‌గా నటిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా..? ఆ రెమ్మ్యూనిరేషన్ ఎంతో తెలిస్తే..?

ఎపుడు రియల్ ఫైట్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే చేసే హీరోలు అప్పుడ‌ప్పుడు డూప్‌ల‌తో త‌మ స‌న్నివేశాల‌ను చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని రిస్కీ షాట్‌ల‌ను చేసేందుకు చాలా మంది హీరోలు సాహ‌సించరు. అలాంటి స‌మ‌యంలో డూప్‌ల‌తో ఆ స‌న్నివేశాల‌ను కానిచ్చేస్తారు ద‌ర్శ‌క‌నిర్మాతలు. అయితే చిరంజీవికి డూప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రేమ్ కుమార్. పశ్చిమ గోదావరికి చెందిన ప్రేమ్ కుమార్ . సొంతంగా ఓ రికార్డింగ్ డాన్స్ కంపెని పెట్టుకున్నాడు.

అచ్చం చిరంజీవి ఆహార్యంలో ఉండే ప్రేమ్ కుమార్.. చాలా సినిమాల్లో చిరంజీవికి డూప్ గా నటిస్తున్నా అని తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ్ కుమార్. దాదాపు 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్ గా నటిస్తున్నా అని తెలిపాడు ప్రేమ్ కుమార్. చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

వశిష్ఠ గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు చిరంజీవితో కూడా వశిష్ఠ ఇదే తరహా సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా లాంటి సినిమాను వశిష్ఠ తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరికొంతమంది హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో నటించనున్నారట.. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

అయితే చాలా కాలంగా చిరుకి ప్రేమ్ కుమార్ డూప్‌గా వ్యవహరిస్తున్నారు. డూప్‌గా నటించినందుకు గానూ ఆయనకు ఒకరకంగా అయితే మంచి రెమ్యూనరేషనే దక్కుతోందట. ఒక్కో సినిమాకు ఆయన రూ.15 లక్షల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటారట. సినిమాలో డూప్‌తో చేయించే సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ లెక్కన చూస్తే ప్రేమ్ కుమార్ మంచి రెమ్యూనరేషనే అందుకున్నట్టు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker