News

నరేష్- పవిత్ర లోకేష్ మళ్ళీ పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా..?

సినిమాల సమయంలో ఏర్పడిన పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. కొద్ది రోజులు ప్రేమాయణం సాగించిన ఈ జంట.. ఆ తర్వాత కొత్త సంవత్సరం సందర్భంగా తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. దీంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసింది. వారిద్దరిని పెళ్లి చేసుకోనివ్వనని.. నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ మధ్య వీరిద్దరి ప్రేమాయణం ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అనేది సోషల్ మీడియాలో నెవర్ ఎండింగ్ టాపిక్.

ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన ఇష్యూస్ లో ఇదొకటి. సరిగ్గా ఈ తరుణంలో ఆ ఇద్దరే మళ్ళీ పెళ్లి అనే సినిమా చేయడం ఆసక్తికరం. పవిత్ర లోకేష్‌తో కలిసి నరేష్ సహజీవనం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతుండగా.. ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి సినిమా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కోసం ముహూర్తం కూడా పెట్టేసి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నరేష్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం. సురేష్ బొమ్మిలి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నరేష్, పవిత్ర లోకేష్ లీడ్ రోల్స్ పోషించారు. కాగా.. ఈ నెలలోనే మళ్ళీ పెళ్లి సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా.. దాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు సీనియర్ యాక్టర్ నరేష్.

ఇంతకీ ఈ మూవీ రిలీజ్ ఎప్పుడంటారా? మే 26న తేదీ. ఈ డేట్ లో పవిత్రతో కలిసి చేసిన మళ్ళీ పెళ్లి సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది అనే నరేశ్ చెప్పారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఈ ‘మళ్ళీ పెళ్లి’ అని, ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ అంచనాలు పెంచేశాయి. సిచుయేషన్ క్యాచ్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.

రీసెంట్ గా వదిలిన ఈ మూవీ టీజర్ లో పవిత్రను నరేష్ లిప్ కిస్ చేసిన సీన్ కూడా ఉండటంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. నరేష్ జీవితంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ఈ టీజర్ ద్వారా ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. సో.. చూడాలి మరి నరేష్- పవిత్రల మళ్ళీ పెళ్లి ఏ మేర జనాలకు కనెక్ట్ అవుతుందనేది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker