ప్లాస్టిక్ సర్జరీ వికటించి ప్రాణాలు పోగొట్టుకున్న స్టార్ మోడల్.
చాలామంది సెలబ్రిటీలా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సర్జరీలు వికటించడంతో మృత్యువాత కూడా పడుతున్నారు. ఇటీవలే పాప్ సింగర్ జిమిన్‌లా కనిపించేందుకు 12సార్లు సర్జరీ చేయించుకున్న సెయింట్ వాన్ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది.
అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్‌లా కనిపించేందుకు సర్జరీ చేయించుకున్న ఓ మోడల్ గుండెపోటుతో కన్నుమూసింది. 34 ఏళ్ల మోడల్ క్రిస్టినా అస్తెన్ గౌర్కానీ అచ్చం కిమ్ కర్దాషియన్‌లా మారిపోవాలనుకుంది. అయితే ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్‌లా కనిపించేందుకు తనను తాను మార్చుకున్న మోడల్ క్రిస్టినా ఆష్టన్ గోర్కానీ గుండెపోటుతో మరణించింది. ఈ నెల 20న ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, ఆమె ప్లాస్టిక్ సర్జరీ కారణంగానే చనిపోయినట్లు పేర్కొన్నారు. కిమ్ కర్దాషియన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పిచ్చ ప్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆమెలా కనిపించాలన్న చాలా మంది నటీమణులు.. సర్జరీలు చేయించుకుంటుంటారు. మోడల్ క్రిస్టినాకు కూడా అదే కోరిక ఉండేది. అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయడం ద్వారా కిమ్ వంటి ఆకృతిని, ముఖాన్ని పొందింది.
శస్త్రచికిత్స తర్వాత, ఆమె సరిగ్గా కిమ్ లాగా కనిపించడం ప్రారంభించింది. అప్పటి నుండి ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కిమ్‌లా కనిపించడానికి అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న తర్వాత, ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కిమ్ కర్దాషియాన్ లాగా అందంగా కనిపించేందుకు క్రిస్టినా రూ.11.12 కోట్లు వెచ్చించి కాస్మెటిక్ సర్జరీ జరిగింది.
అప్పటి నుంచి ఆమెకు అనేక వైద్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి. కొద్దిరోజుల తర్వాత కిమ్ కర్దాషియాన్‌లా కనిపించిన మృతి చెందడం ఆమె అభిమానులను కూడా కలిచివేసింది. అయితే ఏ ఆపరేషన్ కారణంగా ఆమె చనిపోయిందే తెలియరాలేదు. కానీ ప్లాస్టిక్ సర్జరీ కారణంగా గుండె పోటుకు గురై చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.