News

సాయి పల్లవి ఇంట పెళ్లి బాజాలు, కాబోయేవాడి ఫోటోలు వైరల్.

తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సాయి పల్లవి సినిమాలు చేస్తుంది. యంగ్ హీరోలు ఏమాత్రం ఛాన్స్ దొరికిన సాయిపల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఈమె నాగ చైతన్యతో కలిసి ‘లవ్ స్టోరీ’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ కూడా.. అక్క బాటలోనే సినిమాలలోకి వస్తుంది అనుకున్నారు అంతా. ఆమెకూడా తమిళంలో ఓ సినిమాను తీసింది. ఆ తరువాత ఇంకా ఏ సినిమాలను చేయలేదు.

కానీ, సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టీవ్ గానే ఉంటుంది ఈ అమ్మడు. న్యూ ఇయర్ రోజున వీరిద్దరూ దిగిన చిత్రాలు కూడా చాలా వైరల్ అయ్యాయి. అయితే , ఇప్పటివరకు వీరి ఇద్దరి పెళ్లి ప్రస్తావన ఇంతవరకు బయటకు రాలేదు. కానీ, తాజాగా పూజ కన్నన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి విషయాన్నీ బయటపెట్టింది. పూజ తన ప్రియుడిని పరిచయం చేసి అందరిని ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసింది. అక్క కంటే ముందు చెల్లెలు పెళ్లి చేసుకోబోతున్నమాట.

“నాకు అన్నింట్లో పార్ట్నర్‌గా ఉండే వ్యక్తి ఇప్పుడు నిజ జీవితంలో భాగస్వామి కాబోతోన్నాడు” అంటూ .. తనకు కాబోయే భర్తతో కలిసి దిగిని ఫోటోలను షేర్ చేసింది. “నిస్వార్థమైన ప్రేమను పరిచయం చేశాడు.. సహనంగా ఉండటం నేర్పించాడు.. ప్రేమలో నిబద్దతను చూపించాడు.. ఈ వినీత్ నా సూర్య కిరణం.. నా ఆశా కిరణం.. క్రైమ్‌లో నా పార్ట్నర్ అంటే నాకు ఇష్టం.. ఇక ఇప్పుడు జీవిత భాగస్వామి అవుతున్నాడు “అంటూ.. తన ప్రేమను వ్యక్త పరిచింది ఈ అమ్మడు.

దీనితో అందరూ పూజని కంగ్రాట్యులేషన్స్ అంటూ విష్ చేయడం మొదలుపెట్టారు. అక్కకంటే చెల్లెలు ఫాస్ట్ గా ఉందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. చూడబోతుంటే వీరి ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రస్తుతం పూజ కన్నన్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker