News

ఇంత అందమైన అమ్మాయిలు, ఎలాంటి పనులు చేస్తున్నారో చుస్తే నమ్మలేరు.

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశం. అయితే వ్యవసాయం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది మట్టిలో పని చేసే రైతులు కనిపిస్తారు.మట్టి, దుమ్ము, దూళీతో పేరుకుపోయిన డ్రెస్ లు వేసుకొని ఉండటం చూస్తుంటాం. కాని రైతుల్లో ఆడవాళ్లు అది కూడా హీరోయిన్ కంటే గ్లామర్ గా ఉండే వాళ్లు కూడా సాగు చేస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యపోతారు. కాకపోతే ఆమె వేసుకున్న పొట్టి డ్రెస్సులు చూసి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

న్యూజిలాండ్ కి చెందిన 29 ఏళ్ల బ్రిటనీ వుడ్స్ అనే యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ ఫిగర్ గా మారిపోయింది. ఆమెను చూస్తే ఎవరైనా సరే మోడల్ లేదా హీరోయిన్ అనుకునే ఛాన్సుంది. అయితే తాను రైతునని తనకు ఆవులు, గేదెలున్నాయని వాటిని మేపడం అంటే తనకెంతో ఇష్టమంటోంది.

బ్రిటనీ వుడ్స్ తన పొలాల్లో వ్యవసాయ పనులన్నీ స్వయంగా చేసుకుంటుంది. ఆమె ట్రాక్టర్ నడుపుతూ విత్తనాలు నాటడం నుండి పంట కోసే వరకు స్వయంగా చేస్తుంది.న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం ఆమె అందమైన రైతుగా అభివర్ణించవచ్చు.

చూడటానికి కుందనపు బొమ్మలా కనిపించే బ్రిట్నీకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అయితే చేస్తుంది వ్యవసాయమే అయినా ఆమె వేసుకునే దుస్తులు మోడ్రన్ గా ఉండటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.తన స్టైల్ నచ్చక ట్రోలర్స్ చేసేవారి సంఖ్య ఎక్కువగా మహిళలేనని అంటోంది బ్రిట్నీ.

వ్యవసాయ పనులు చేస్తున్నంత మాత్రనా ఆమె చదువుకోలేదనుకుంటే మనం పొరపాటు పడ్డట్లే. తాను యూనివర్శిటీ నుండి బిజినెస్, మార్కెటింగ్ కూడా చదివానని చెబుతోంది. రెండేళ్ల తర్వాత అన్నింటినీ విడిచిపెట్టానని అమ్మాయి పేర్కొంది. ఇప్పుడు కేవలం కంటెంట్ క్రియేషన్, ఫార్మింగ్ ద్వారానే లక్షల రూపాయలు సంపాదిస్తోంది.

బహుశా పురుషాధిక్య ప్రపంచంలో పని చేయడం వల్లే ఇక్కడ మహిళలు ఎక్కువగా పనిచేయకపోవడం వల్ల తనకు అంత గౌరవం లభించడం లేదని బ్రిటన్ యువతి చెప్పింది. ఇది గ్లామర్‌ల పని కాదని కూడా అంటున్నారు. అన్నీ వదిలేసి వ్యవసాయం చేయాలని చాలా సార్లు అనుకున్నానని అయితే డబ్బు సంపాదించాలంటే కంటెంట్ క్రియేషన్ కూడా చేయాల్సి ఉంటుందని బ్రిటనీ చెప్పింది. వ్యవసాయ పనుల్లో తనకు సహకరిస్తున్న వారిని కూడా కొనియాడారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker