News

దొంగతనం చేస్తూ అడ్డంగా కెమెరాకు దొరికిన మహిళా ఎంపీ. CCTV ఫుటేజ్ రావడంతో..!

దొంగతనం ఆరోపణలతో పదవికి రాజీనీమా చేసిన మహిళా ఎంపీ పేరు గోల్రీజ్. ఆమె ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మాజీ న్యాయవాది. న్యూజిల్యాండ్ ప్రభుత్వంలో న్యాయశాఖ పోర్ట్ ఫోలియోని నిర్వహించారు. అంతేకాకుండా న్యూజిల్యాండ్ గవర్నమెంట్లో పోర్ట్ ఫోలియో దక్కించుకున్న తొలి శరణార్థిగా గోల్రీజ్ 2017లో చరిత్ర సృష్టించారు. అయితే ఆమె ఒక ఎంపీ. చట్టసభకు ఎంపికైన సదరు మహిళా నేత.. షాపుల్లో దొంగతనం చేస్తూ కెమేరా కంటికి దొరికిపోయింది.

దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ గా మారటం.. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో.. మరో దారి లేని ఆమె తాజాగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైనం ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకూ సదరు మహిళా ఎంపీ ఏ దేశానికి చెందిన వారన్నది చూస్తే.. ఆమె న్యూజిలాండ్ కు చెందిన గోలిజ్ గ్రాహమన్. కొద్ది రోజులకు ముందు ఇదే న్యూజిలాండ్ కు చెందిన యువ మహిళా ఎంపీ ఒకరు తన పవర్ ఫుల్ స్పీచ్ తో.. ఆ దేశ పార్లమెంట్ ను.. ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేయటం తెలిసిందే.

అందుకు భిన్నంగా మహిళా ఎంపీ గోలిజ్ మాత్రం తన తీరుతో న్యూజిలాండ్ దేశ పరువును మంట కలిపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్లాండ్.. వెల్లింగ్టన్ నగరాల్లోని వస్త్ర దుకాణాలు.. షాపింగ్ మాల్ లో మూడుసార్లు ఆమె చోరీకి పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖరీదైన హ్యాండ్ బ్యాగ్.. డ్రెస్ లను చోరీ చేస్తూ కెమేరా కంటికి చిక్కేశారు.

ఈ నేపథ్యంలో ఆమెపై వచ్చిన విమర్శల తాకిడితో మరో మార్గం లేక ఆమె తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే.. ఈ సందర్భంగా తాను చేసిన తప్పుడు పనుల్ని తెలివిగా కవర్ చేసుకునే ప్రయత్నం చేయటం గమనార్హం. తాను చోరీ చేయటానికి కారణం.. తన మానసిక ఆరోగ్యం సరిగా లేదని పేర్కొనటం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన సీసీ ఫుటేజ్ దెబ్బకు తన ప్రవర్తనకు సారీ చెప్పిన ఆమె.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker