News

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌, అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ముందున్నాడు మాచిరాజు ప్రదీప్. యాంకర్ గా మనోడు స్టార్. ప్రదీప్ వేసే పంచులకు పగలబడి నవ్వడంతో పాటు.. అమ్మాయిలు ఇంప్రెస్ అయ్యి.. పడిపోతుంటారు కూడా. ఈక్రమంలో అతనికి ప్రపోజ్ చేసిన అమ్మాయిలెందరో.. కాని మనోడి పెళ్లి.. ప్రేమ గురించి మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. గతంలో ప్రదీప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మొదలైంది.

అతడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడని వినిపిస్తోంది. ప్రదీప్-నవ్య చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఎట్టకేలకు వీరి బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని భావించారని చెప్పుకుంటున్నారు. అయితే ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు.ఈ క్రమంలో ప్రదీప్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అందుకే తరచూ అతని పెళ్లి రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి గురించి రచ్చ మొదలైంది. ప్రదీప్ మాచిరాజు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఏకంగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా మంచు లక్ష్మి నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ ఈవెంట్ లో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ప్రదీప్ కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాడు. మెరూన్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిశాడు. కాగా ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

సదరు ఫోటోలను చూసిన ఫ్యాన్స్… మీకు పెళ్లి ఎప్పుడు? మీ ఫేస్ లో పెళ్లి కళ ఉట్టిపడుతుంది .. అందుకేనా షోస్ మానేశారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో… ఏంటి బ్రో షోస్ లో కనిపించడం లేదు .. మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ ఎలాంటి షోలు చేయడం లేదు. ఇందుకు కారణం ఏమిటో తెలియదు. ఇటీవల ఢీ షో నుంచి కూడా ప్రదీప్ తప్పుకున్నాడు. ఢీ 9 నుంచి ఢీ 14 వరకు సుదీర్ఘ కాలం వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఢీ షో లో హైపర్ ఆది, ప్రదీప్ కాంబినేషన్ అదుర్స్ అని చెప్పాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker