News

జిమ్‌లో తెగ కష్టపడుతున్న యుంగ్ హిరోయిన్, వైరల్ అవుతున్న వీడియో.

అమిగోస్ మూవీతో తెలుగులో అడుగు పెట్టిన అషికా రంగనాథ్ తన అందం, అభినయంతో ఫిల్మ్ ఇండస్ట్రీ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చేతినిండా ఆఫర్స్ తో ఈ ముద్దుగుమ్మ కాస్త బిజీ గానే ఉంటుంది.. ఇదే టైం లో సోషల్ మీడియాలో ఈ వయ్యారి భామ ఫుల్ క్రేజ్ తో స్పీడ్ మీద ఉంది. తాగాజా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. అయితే 2014 లో మిస్ ఫ్రెష్ ఫేస్ లో రన్నరప్ గా నిలిచింది ఆషికా రంగనాథ్.

2016 లో కన్నడ ఇండస్ట్రీలోకి ‘క్రేజీ బాయ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘మాస్ లీడర్’ మూవీలో నటించింది. కన్నడ నాట సెన్సేషన్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జేమ్స్ ’ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ నాట పలు సినిమాల్లో నటించింది. సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు..

లక్ కలిసి వస్తే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. కళ్యాన్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో కళ్యాన్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్ తో కొత్తదనం అందించేందుకు ప్రయత్నించారు. కాకపోతే ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

అయినా ఈ అమ్మడికి తెలుగు లో ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అక్కినేని నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులు బాగా దగ్గరయ్యింది. నా సామిరకంగ మంచి సక్సెస్ సాధించి భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఆషికా రంగనాథ్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker