News

కొడుకు పెళ్ళి వేడుకల్లో డాన్స్ వేస్తున్న షర్మిల, వైరల్ వీడియో.

రాజారెడ్డి ప్రేమించిన ప్రియా అట్లూరితో వివాహాన్ని జోథ్ పూర్ లోని కోటలో అత్యద్బుతంగా జరిపించారు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు. మూడ్రోజుల పాటు ప్యాలేస్ లో వీరి వివాహ వేడుకల సంబురాలను జరుపుకున్నారు. షర్మిల ఫ్యామిలీ క్రైస్తవ మతం తీసుకోవడంతో మొదట ఆ మత ఆచారం ప్రకారం వివాహం జరిపించారు. ఫిబ్రవరి 16వ తేది నుంచి 18వ తేది వరకు రాజారెడ్డి, ప్రియాల వివాహ వేడుకలు జరిగాయి.

ఇక హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన పెళ్లిలో వధు, వరులు ఇద్దరూ పట్టు వస్త్రాలు ధరించారు. పట్టుచీరలో ప్రియా, పంచె, షర్టులో రాజారెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన పెళ్లి మండపంలో ముహుర్తం టైమ్ కి తాళి కట్టాడు. అయితే రాజారెడ్డి, ప్రియల వివాహ వేడుకలో భాగంగా ఫిబ్రవరి16న హల్దీ, సంగీత్, మెహందీ వేడుకలు జరిగాయి.

ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు నూతన వధూ వరులను ఆశీర్వదిస్తూ.. ఎంతో సంతోషంగా సందడి చేశారు. ఈ క్రమంలో పెళ్లి వేడుకలో భాగమైన హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు వైఎస్‌ షర్మిల. కాగా, ఈ వీడియోలో షర్మిల కుటుంబ సభ్యులు అయిన.. వైఎస్ విజయమ్మ, షర్మిల-అనిల్ దంపతులు, కూతురు అంజలి, వధువు అట్లూరి ప్రియా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కనిపించారు.

ప్రస్తుతం వైఎస్‌ షర్మిల కుమారిని వివాహానికి సంబంధించిన ప్రతి ఫోటో, వీడియో సోషల్ మీడియాలో .. నిమిషాల్లో వైరల్ అవుతోంది. మరి,తాజాగా షేర్ చేసిన వైఎస్‌ షర్మిల కుమారిని హల్దీ సెర్మనీ వీడియోపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker