Health

మేనరికాలు చేసుకుంటే ఈ వ్యాధి ఖచ్చితంగా వస్తుందా..?

మేనరికం పేరుతో దగ్గరి బంధువులను పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ.. పెండ్లికి ముందు, తర్వాత జన్యు పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల పుట్టబోయే పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. ఆధునిక వైద్య పరిజ్ఞానంతో తగిన నివారణ చర్యలు తీసుకోవచ్చు. పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. అయితే కొన్ని రకాల వ్యాధుల గురించి చాలామందికి అవగాహన ఉండదు నిజానికి అవగాహన లేకపోవడం వలన చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తలసేమియా సమస్య గురించి చాలా మందికి అసలు అవగాహన లేదు ప్రతి సంవత్సరం మే 8వ తేదీన ప్రపంచ తలసేమియా దినోత్సవం గా గుర్తించడం జరిగింది. ఈ వ్యాధి బారిన పడే చనిపోయిన వాళ్లకి నివాళులు అర్పిస్తారు పైగా ప్రతి సంవత్సరం ఈ రోజున ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం గురించి అనేక కార్యక్రమాలను చేపడతారు. వంశం లో ఎవరికైనా తలసేమియా ఉంటే అది కుటుంబంలో ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. మేనరికం కూడా ఇందుకు కారణమని డాక్టర్ అంటున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు వ్యాధి దశని బట్టీ లక్షణాలు మారుతాయి. మొదటి స్టేజ్ లో మాత్రం ఎటువంటి లక్షణాలు కనబడవు రెండవ స్టేజ్ లో రక్తహీనత ఉంటుంది తేలికపాటి అలసట వ్యాయమం చేయడం ఇష్టం లేకపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. మూడో దశలో అయితే హిమోగ్లోబిన్ హెచ్ వ్యాధి సమయంలో తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. శక్తిని కోల్పోయినట్లు ఉండడం వ్యాయామం చేయడానికి ఇబ్బందిగా ఉండడం తో పాటుగా లివర్ లో వాపు రావడం, శరీరం పచ్చగా మారిపోవడం, కాళ్ళ అల్సర్ వంటివి.

ఈ మూడవ దశలో పిల్లలకి జన్మనివ్వడం ఎంతో ప్రమాదం. నాలుగో దశలో ఎంతో ప్రమాదకరం గా మారిపోతుంది పిల్లలు పుట్టక ముందే కడుపులో చనిపోయే ప్రమాదం నాలుగో దశలో ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తయారు చేస్తే జన్యువులు దెబ్బతిన్నప్పుడు ఈ తలసేమియా సోకే ప్రమాదం ఉంది తలసేమియా సోకిన వాళ్ళు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. ఎర్ర రక్త కణాలు లేదంటే హిమోగ్లోబిన్ ఉండాల్సిన మోతాదులో లేకపోవడం తో రక్తహీనత కలుగుతుంది.

ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలు, ద‌క్షిణాసియా, ద‌క్షిణ చైనా ప్రాంతాలలో ఈ వ్యాధి ఎక్కువ ఉంటుంది. సీబీసీ (కంప్లీట్ బ్ల‌డ్ కౌంట్‌) టెస్ట్‌, హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫొరెసిస్‌, ఫెర్రిటిన్, ఎఫ్‌పీ (ఫ్రీ-ఎరిత్రోసైట్ ప్రోటోపోరోపైరిన్‌) ద్వారా దీన్ని నిర్ధారించ‌వ‌చ్చు. ఒక్క బ్ల‌డ్ శాంపిల్‌ తో టెస్ట్స్ అన్నీ చేయించుకోవ‌చ్చు. వ‌య‌స్సు, ఆరోగ్య ప‌రిస్థితి, వ్యాధి తీవ్ర‌త‌ అలానే మెడిక‌ల్ హిస్ట‌రీ, మందుల‌కు స్పందించే తీరు బ‌ట్టి చికిత్స ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker