Miracle Health Tips: రోజు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, మీరు 100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు.

Miracle Health Tips: రోజు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, మీరు 100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు.
Miracle Health Tips: రోజూ ఉదయాన్నే నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగండి. తులసిమొక్కకు రోగనిరోధకశక్తిని పెంచే గుణంతోపాటు.. ఇందులోని ఔషధగుణాలు గొంతును, ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతాయి. అయితే అనారోగ్యం బారిన పడకుండా నియంత్రించేది రోగ నిరోధక వ్యవస్థ. ప్రాథమికంగా అనారోగ్యాన్ని శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుంది. కరోనా వంటి వైరస్‌లను కూడా నిలువరించిన గొప్ప రక్షణ కవచం రోగ నిరోధక వ్యవస్థ. మరి అలాంటి రోగ నిరోధక శక్తి తగ్గితే అనారోగ్యానికి గురవుతాం. అధికంగా నీరు తాగడం..నీరు తక్కువగా తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పడిపోయే ప్రమాదం ఉంటుంది.

రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లేందుకు ఇది సహాయపడుతుంది. రక్త ప్రవాహం మెరుగవుతుంది. సెల్స్‌కు ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. జీర్ణవ్యవస్థ మెటాబాలిజాన్ని పెంచుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. నిద్రతో మెరుగు..నిద్రలేమి వల్ల వ్యాధులతో పోరాడే శక్తి తగ్గుతుంది. అలసట, మానసిక ఉద్రేకం వస్తాయి. నిద్ర బాగా పడితే వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. నిద్రపోయే సమయంలో శరీరం మరమ్మతులు చేసుకుంటుంది.
Also Read: చేపలతోపాటు వీటిని కలిపి పొరపాటున అస్సలు కలిపి తినకండి.
హార్మోన్ల ఉత్పత్తి వేగంగా జరిగి ఒత్తిడి తగ్గుతుంది. మెదడు విశ్రాంతి తీసుకోవడం భారీ ఉపశమనం లభిస్తుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలంగా మారుతుంది. రంగురంగుల ఆహారం..పచ్చ, నారింజ, ఎరుపు రంగు కూరగాయలు తినాలి. ఇవి విటమిన్ ఏ, సీ, ఈలతో నిండి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి శక్తి అందుతుంది. వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. నేచురల్ ఇన్ఫ్లమేషన్‌కి చెక్ వేస్తాయి. కండరాలకు బలం ఇస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాయామం..రోజుకు కనీసం 30 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలి.
Also Read: నేరేడు గింజలను ఇలా చేసి తీసుకుంటే చాలు.
నడక, యోగా, ప్రాణాయామం ఉపయోగపడతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ వ్యవస్థను శక్తివంతంగా ఉంచుతుంది. హార్మోన్ల బ్యాలెన్స్ సరిగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం మెరుగై ఒత్తిడి తగ్గుతుంది. వ్యాధులకు చెక్ వేయడంలో సహాయపడుతుంది. విటమిన్లు..విటమిన్లు అధికంగా ఉండే నిమ్మకాయ, ఉసిరికాయ, నారింజలు తీసుకోవాలి. వీటిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లపై పోరాటం చేస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.
Also Read: పీరియడ్స్ సమయంలో ఆ నొప్పులు వేధిస్తున్నాయా..?
తలనొప్పి, అలసట తగ్గుతుంది. మానసిక ఒత్తిడి..ఒత్తిడితో హార్మోన్ల అసమతుల్యత వస్తుంది. కార్టిసోల్ అధికంగా విడుదలవుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. మానసిక శాంతి కోసం ధ్యానం చేయండి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకుని ప్రశాంత వాతావరణంలో ఉండండి. మ్యూజిక్ థెరపీ లేదా నడక మంచిది. ఆత్మస్థైర్యంతో జీవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జంక్ ఫుడ్..అధిక చక్కెర రక్తంలోని శ్వేత కణాల పని తక్కువ చేస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ శరీరాన్ని అలసిపోయేలా చేస్తాయి. శరీర బరువు పెరగడం వల్ల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ స్లో అవుతుంది.
Also Read: మీ తెల్ల జుట్టుని ఈ చిట్కాలు ద్వారా 5 నిమిషాల్లోనే నల్లగా మార్చుకోవచు.
మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయి. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌కు అవకాశం ఉంటుంది. హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి. తాజా పండ్లు మంచి ప్రత్యామ్నాయం. ప్రొ బయోటిక్స్.. రక్షణ కవచాలు..పెరుగు, బటర్ మిల్క్ వంటి వాటిలో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియాను అందిస్తాయి. వ్యాధి కారక బ్యాక్టీరియాను అరికడతాయి.
Also Read: ప్రతి రోజు రాత్రి 10గంటలలోగా నిద్రపోతే చాలు.
ఫ్రీ మోషన్ సాఫీగా జరుగుతుంది. పొట్ట నొప్పులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.సోంపు, తులసి..తులసి, అల్లం, పెరుగు, మిరియాలు వంటి హెర్బల్స్ ఉపయోగించాలి. ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. శ్వాసకోశం ఆరోగ్యంగా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తశుద్ధి చేయడంలో సహాయపడతాయి. నేచురల్ యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. రోజూ 1 కప్పు హెర్బల్ టీ తాగడం మంచిది. ఇది రోగనిరోధక శక్తికి బలమవుతుంది.
సూర్యరశ్మి ఔషధం..రోజుకు కనీసం 20 నిమిషాలు ఉదయపు సూర్యరశ్మిని పొందాలి. విటమిన్ డీ శరీరంలో తయారవుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు కీలకం. ఎముకలు బలపడతాయి. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది.