News

దేశాన్ని వణికిస్తున్న ‘మంకీ ఫీవర్’, ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే ఏం చెయ్యాలంటే..?

ఏవైనా కీటకాలు కోతులను కుట్టి.. మళ్లీ వచ్చి మనిషిని కుడితే మంకీ ఫీవర్ వస్తుంది. ఈగల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కోతుల జ్వరం వస్తే మనిషి నీరసం అయిపోతాడు. ఏదైనా ప్రాంతంలో కోతులు అసాధారణంగా చనిపోతే, వాటి రక్త నమూనాలను పరీక్షించాలని కర్ణాటక ఆరోగ్య శాఖ చెప్పింది. కోతులు లేదా మనుషులకు ఇన్ఫెక్షన్ సోకితే 5 కి.మీ ప్రాంతం వరకు నిఘా ఉంచాలని తెలిపింది. అయితే దేశ వ్యాప్తంగా కూడా ఈ మంకీ ఫీవర్ హడలెత్తిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కోతుల బెడద ఎక్కువగా ఉంటోంది.

మంకీ ఫీవర్‌ను క్యాసనూర్ ఫారెస్ట్ డీజీజ్ అని కూడా అంటారు. ఈ వైరస్ మొదట కర్నాటకలో బయట పడింది. ఈ ఫీవర్‌తో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కర్నాటకలో దాదాపు 49 మందికి ఈ వైరస్ సోకినట్లు ఆ రాష్ట్రం తెలిపింది. మంకీ ఫీవర్ ఎలా వస్తుంది..ఏవైనా కీటకాలు కోతులను కుట్టి.. అవి వచ్చి మళ్లీ మనుషుల్ని కుట్టినప్పుడు ఈ మంకీ ఫీవర్ అనేది వస్తుంది. ఈగల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఈ మంకీ ఫీవర్.. మనిషికి వచ్చిందంటే బాగా నీరసించిపోతాడు.

మంకీ ఫీవర్ లక్షణాలు:-ఈ ఫీవర్ వచ్చినప్పుడు బాగా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. మొదట జ్వరం వస్తుంది. ఆ తర్వాత దగ్గు, జలుబు, తల నొప్పి, వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. తీవ్రమైన వణుకు, దృష్టి లోపం, చికాకు కూడా కొందరిలో కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ముక్కు రంద్రాల పైభాగం నుంచి రక్త స్రావం, గొంతు, చిగుళ్ల నుంచి రక్త స్రావం, పేగు కదలికల సమయంలో రక్త స్రావం వంటివి కూడా కనిపిస్తాయి. వణుకు, గందరగోళం, మానసిక ఆందోళన కూడా ఉంటుంది.

కాబట్టి ఈ లక్షణాలన్నీ కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి టీకాలు వేయించుకోవాలి. ఈ ఫీవర్ వచ్చిన వాళ్లు ఇతర ప్రదేశాలు వెళ్లకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు:- ఈ ఫీవర్ వచ్చినప్పుడు వీలైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఉండటం మంచింది. ఎందుకంటే ఈ ఫీవర్ ఇతరులకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. చేతులకు గ్లౌజులు ధరించడం మేలు. వ్యక్తి గత శుభ్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ఫీవర్ సాధారణంగా ఉంటుంది. అయితే లక్షణాలు మరింత తీవ్రమైతే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker