Health

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే శరీరంలోని విషపదార్థాలన్ని బయటకు పోతాయి.

బూడిద గుమ్మడికాయ.. వింటర్‌ మిలన్‌, చైనీస్‌ మిలన్‌, సఫేద్‌ కద్దూ.. ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం. గ్రామాల్లో ఇంటి వెనకాలే విరివిగా కాస్తుంటాయి. అయితే, వీటిని తినకుండా మనం లైట్‌ తీసుకుంటాం. మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు దీనిలో ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్‌, జింక్‌, కాల్షియం, ఐరన్‌తోపాటు విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ5, బీ6 వంటివి వీటిని తినడం ద్వారా పొందవచ్చు. వీటిలో 96 శాతం నీరు ఉండి డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి రక్షిస్తుంది.

శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహకరిస్తుంది. అయితే బూడిద గుమ్మడి కాయలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, డైటరీ ఫైబర్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. తెల్ల గుమ్మడికాయ తింటే ఆకలి తగ్గుతుంది. కాబట్టి మీరు మళ్లీ మళ్లీ తినవలసిన అవసరం లేదు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. తెల్ల గుమ్మడికాయలో మంచి మొత్తంలో విటమిన్ B3 ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మీ శరీరానికి శక్తినిస్తుంది.

దీన్ని తీసుకోవడం వల్ల మీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. తెల్ల గుమ్మడికాయ రసం తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. తెల్ల గుమ్మడికాయ జ్యూస్‌ తయారు చేయటం కోసం.. ముందుగా గుమ్మడికాయ పొట్టు తీసి ముక్కలుగా కోసి బ్లెండర్‌లో వేయాలి. దానికి నిమ్మరసం కలపండి. తర్వాత ఈ రెండు మిశ్రమాలను బాగా కలపాలి. ఈ జ్యూస్‌ని వారానికి రెండు సార్లు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.

బూడిద గుమ్మడికాయలోని పొటాషియం బీపీ కంట్రోల్ లో ఉంచేందుకు దోహదపడుతుంది. దీనివల్ల గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. బూడిద గుమ్మడి కాయ రసం తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం సమస్య దూరమవుతుంది. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి కూడా రక్షణనిస్తాయి. బూడిద గుమ్మడి కాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

100 గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి కేవలం 13 క్యాలరీలఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కడుపు నిండుగా ఉంటుంది. తక్కువగా తింటారు. మెదడు పనితీరును మెరుగుపరచుకోవాలంటే దీనిని తరచుగా డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker