Health

ఈ కాలంలో శ్వాస సమస్యలున్నవారు ఎలాంటి జాగర్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

శ్వాస సంబంధిత సమస్య అంటే మామూలుగా మనం శ్వాస తీసుకుంటూ ఉంటాము. అది ఎంతో ఫ్రీ గా ఉంటుంది కానీ ఈ సమస్య వచ్చినప్పుడు సరిపడా అంత గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు. నొప్పిగా ఉంటుంది. రెస్పిరేటరీ సమస్యలు కూడా ఉండొచ్చు. ఆస్తమా, ఇన్ఫెక్షన్స్, హృదయ సంబంధిత సమస్యలు వలన కూడా శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. అయితే సాధారణంగా శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు ఈ శీతా కాలంలో శ్వాస తీసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ముఖ్యంగా రాత్రి పూట నిద్రపోయే సమయంలో ఉబ్బసం, అలెర్జీలు, శ్వాస సమస్యలు ఉంటే గుండె మీద ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే వారికి రాత్రి పూట సరిగా నిద్ర పట్టదు. ఈ ఎఫెక్ట్ కాస్తా.. వారి ఆరోగ్యంపై పడుతుంది. పగటి పూట అలసటగా అనిపిస్తుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి:- శ్వాస కోశ సమస్యల్ని ఎదుర్కొనడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల్య ఆహారం పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన ఆహారం మీ ఊపిరి తిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అందువల్ల ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వులు, విటమిన్లు ఉన్నటువంటి ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవడం వల్ల ఈ ఇబ్బంది నుంచి బయట పడొచ్చు. ఎక్కువగా నీరు తాగాలి:- ఊపిరి తిత్తుల సమస్యలతో బాధ పడేవారు ఎక్కువగా నీరు త్రాగాలి. ఎందుకంటే ఇది ఊపిరి తిత్తుల ద్వారా ఏర్పడిన శ్లేష్మాన్ని తొలగించి.. శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. బ్రీత్ ఎక్సర్ సైజ్ లు:-రెగ్యులర్ గా బ్రీత్ ఎక్సర్ సైజులు చేయడం వల్ల కూడా ఊపిరి తిత్తుల సామర్థ్యం మెరుగు పడుతుంది.

యాక్టీవ్ గా వ్యాయామాల్లో పాల్గొనడం, యోగా చేయడం వల్ల ఊపిరి తిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవసరం అయిన వారు ఏరోబిక్ వ్యాయామాలు కూడా చేయవచ్చు. ఆవిరిని పీల్చడం:-చలి కాలం.. ఉబ్బసం, ఆయాసం ఉన్న వారికి చాలా కష్టంగా సాగుతుంది. ఎందుకంటే వీరికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆవిరి పట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీని వల్ల ముక్కు కూడా క్లియర్ గా ఉండి.. ఊపిరి తిత్తుల్లో శ్లేష్మం బయటకు పోయేందుకు అవకాశం ఉంటుంది.

హెర్బల్ టీలు:-ఇంట్లో తయారు చేసుకున్న హెర్బల్ టీలు తాగడం వల్ల మంచి ఉపశనం ఉంటుంది. అల్లం, పుదీనా, లైకోరైస్ రూట్, థైమ్ వంటి కొన్ని హెర్బల్ టీలు తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థను ఉపశమనం చేస్తాయి. పొగ త్రాగడం:-ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పొగ త్రాగడం కూడా మానేయాలి. అలేగే బయట కూడా గాలి నాణ్యత అనేది తగ్గుతూ ఉంది. శ్వాస కోశ సమస్యలతో బాధ పడేవారు చలి కాలంలో వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండాలి. ధూమ పానం శ్వాస కోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి ఈ అలవాటను వెంటనే వదిలి పెట్టండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker