ఉదయాన్నే రెండు ఈ ఆకులు తింటే మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.
పూర్వకాలం నుంచి మారేడు చెట్టు ప్రాచుర్యంలో ఉంది. ఈ మారేడు చెట్టు అంటే ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరం. మారేడు ఆకులు మూడు ఆకులు కలిపి ఒకే ఈనెల ఉంటాయి. ఇవి ఆ పరమశివుడి మూడు కన్నులను సూచిస్తాయని హిందువుల నమ్మకం. శివుడు ఎంతో ఇష్టమైన ఈ చెట్టు కిందనే నివాసం ఉంటాడని భావిస్తారు. అయితే ఈ చెట్టు పవిత్రమైనదే కాదు ఎన్నో ఔషదగుణాలను కలిగిఉంది. మంచి ఔషద గుణలున్న మారేడు చెట్టు పండ్లు, కాయలు, ఆకులు, పువ్వులు, బెరడు, వేర్లను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. అయితే షుగర్ వ్యాధికి మారేడు ఆకుతో పరిష్కారం..
7 లేదా 8 మారేడు ఆకులను నీటిలో వేసి 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత 50 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.. మారేడు ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల వాత, కఫ, పిత దోషాలన్నీ తొలగిపోతాయి.
ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మారేడు ఆకులు అందుబాటులో లేని వారు ఒకేసారి ఎక్కువ మొత్తంలో మారేడు ఆకులు, బెరడు, కాండం వంటి వాటిని నీడలో ఎండబెట్టి పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు… ఈ పొడిని రోజుకు రెండు పూటలా పూటకు 5 గ్రాముల చొప్పున గోరు వెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. రామ తులసితో కూడా.. రామ తులసి ఆకులను ఉపయోగించడం వల్ల కూడా షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చట..
రెండు లేదా మూడు రామ తులసి ఆకుల మిశ్రమానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవడం వల్ల కూడా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్‌లు తీసుకునే వారు కూడా ఈ రామ తులసి ఆకులను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 10 గ్రాముల దాల్చిన చెక్కను ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి రోజుకు రెండు పూటలా టీ లాగా తాగడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులు మంచి ఫలితాలను పొందవచ్చు.
ఒక టీ స్పూన్ మెంతులను అర గ్లాస్ నీటిలో పోసి 12 గంటల పాటు నానబెట్టండి.. తరువాత ఈ నీటిని తాగి మెంతులను తినండి.. ఇలా చేయడం వల్ల కూడా షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా షుగర్‌ను నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని పాటించడం వల్ల షుగర్ వ్యాధి తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది.