Health

ఉదయాన్నే రాగి జావ ఒక్క గ్లాస్ చాలు, ఈ రోగాలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.

రాగి జావలో క్యాల్షియం, పీచుపదార్థం, మాంసకృత్తులు అధిక మొత్తంలో ఉంటాయి. కనుక రాగి జావను తాగితే కడుపు నిండిన అనుభూతి కలిగి తొందరగా ఆకలి అవ్వదు. ఇది జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరించి నిదానంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే తీసుకునే ఆహారంపై కూడా దీని ప్రభావం పడి, తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకునేలా చేస్తుంది. అయితే రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరాహంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇది కూడా ఒకటి. చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అయితే ఉదయం పూట రాగి జావ తీసుకుంటే చాలా మంచిది.

చిరుధాన్యా్లో రాగులది ప్రత్యేక స్థానం. అనేక ఏళ్లుగా ఆహారంలో వీటిని ఉపయోగిస్తారు. వీటిని తీసుకుంటే.. మన శరీరానికి శక్తి ఎక్కువగా లభిస్తుంది. చాలా బలవర్ధకమైన ఆహారం. ఇందులో మన శరీరానికి అవసరమయ్యే.. అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకున్నా.. వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. రాగుల్లో ఉండే.. అమైనో యాసిడ్స్ త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. బరువు కూడా నియంత్రిస్తాయి. ఇందులో అధికంగా ఫైబర్ కంటంట్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.

ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నడి వయసు స్త్రీలు… ఎముకలు పటుత్వా్న్ని కోల్పోతారు. రాగులను ఆహారంగా తీసుకుంటే వీటిలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సాయం చేస్తుంది. రాగుల వలన నిద్రలేమి, ఆందోళన, వ్యాకులల వంటి సమస్యలు దూరం అవుతాయి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు.. రాగులను రోజూ వారి ఆహారంలో తీసుకోవాలి. తక్షణ శక్తి వస్తుంది. మధుమేహంతో బాధపడేవారు కూడా రాగులతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే మంచిది.

అయితే ఉదయం పూట.. అల్పాహారం సమయంలో ఒక్క గ్లాస్ రాగి జావ తాగితే.. ఎన్నో సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ముందుగా రాగులను వేయించి.. పొడిగా చేయాలి. ఈ పొడిని బియ్యంతో కలిపి వండుకుని తినొచ్చు. చాలా శక్తి లభిస్తుంది. రాగి పిండితో జావ చేసి పిల్లలకు ఇస్తే.. వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఎముకలు బలంగా తయారు అవుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రాగి జావలో మజ్జిగ, ఉప్పు వేసి కలిపి తాగాలి.

ఇలా చేస్తే.. నీరసం, ఆందోళన తగ్గడంతోపాటుగా శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. రాగులను ఆహారంగా తీసుకుంటే.. పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రాగులను రోజూ వారి ఆహారంలో తీసుకోవాలి. చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. బాలింతలు రాగులను ఆహారంగా తీసుకుంటే.. వారిలో పాల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఉదయం పూట.. రాగి జావ తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker