Health

రెండుసార్లు బ్రష్ చేసినా నోట్లో నుంచి వాసన వస్తుందా..? లైట్‌ తీసుకోవద్దు, మీ ఆరోగ్యం చాలా ప్రమాదంలో ఉంది.

నోరు తెరిస్తే దుర్వాసన వస్తుందని భయపడిపోతుంటాం. ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని ఫీలైపోతుంటాం. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది మార్కెట్‌లో దొరికే మౌత్‌ ఫ్రెషనర్లను వాడుతుంటారు. అయితే నోటిని సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఇది సహజం. ప్రతి రోజూ పళ్లను తోముకోవాలి. ఫ్లోసింగ్ చేయాలి. ఖచ్చితంగా నాలుకను క్లీన్ చేయాలి. ఇవన్నీ చేస్తే నోటి నుంచి చెడు వాసన రానే రాదు. ఒకవేళ వస్తే మాత్రం మీకు ఏవైనా అనారోగ్య సమస్యలున్నాయేమో చెక్ చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

స్మోకింగ్ అలవాటు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతుంది. అందుకే ఈ అలవాటును మానుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నోట్లో లాలాజలం లేకపోవడం, నోరు పొడిబారడం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. కొంతమందికి కొన్ని మందుల వాడకం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అలాగే కొన్ని ఆహారాలు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. కానీ దీన్ని తగ్గించుకోవచ్చు.

కొంతమందికి చిగుళ్ల వ్యాధి కూడా దుర్వాసనకు కారణమవుతుంది. అలాగే శ్వాసకోశ వ్యాధులు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. జీర్ణ సమస్యలు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఇది కడుపు లోపలి నుంచి వచ్చే దుర్వాసన. ఈ సమస్యల వల్ల వచ్చే నోటి దుర్వాసనను మీరు బ్రష్ చేయడం లేదా ఫ్లోసింగ్ తో పోగొట్టలేరు. అందుకే అసలు మీ నోటి దుర్వాసనకు అసలు కారణమేంటో గుర్తించి , చికిత్స చేయించుకోవాలి.

రోజంతా పుష్కలంగా నీళ్లను తాగడం, ఆరోగ్యంగా తినడం, స్మోకింగ్, ఆల్కహాల్ ను మానేయడం వంటి అలవాట్లతో నోటి దుర్వాసను తగ్గించుకోవచ్చు. అలాగే రెగ్యులర్ గా ఫ్లోసింగ్ చేయాలి. అలాగే ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ను ఉపయోగించండి. అలాగే అప్పుడప్పుడు డెంటల్ హాస్పటల్ కు వెళ్లి చెక్ చేయించుకోవడం మంచిది. చిగుళ్ల వ్యాధి, దుర్వాసనకు కారణమయ్యే ఇతర వ్యాధులను నిర్ధారించడానికి డాక్టర్ కు చూపించుకోండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker