సినీపరిశ్రమలో తీవ్ర విషాదం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్మాత మృతి.
‘గో గోవా గాన్’, ‘ఏక్ విలన్’ సినిమాల నిర్మాత ముఖేష్ ఉదేషి ఈ లోకానికి వీడ్కోలు పలికారు. ఈ వార్త విని బాలీవుడ్ మొత్తం షాక్ అయ్యింది. ముఖేష్ తన కెరీర్‌లో ఎన్నో గొప్ప బాలీవుడ్ చిత్రాలను కూడా నిర్మించారు. ఇందులో ‘ది విలన్’ అలాగే ‘కలకత్తా మెయిల్’ ఉన్నాయి. అయితే సినీ ఇండస్ర్టీలో మరో విషాదం చోటు చేసుకుంది.
చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన బాలీవుడ్ నిర్మాత ముకేశ్ ఉద్దేశి సోమవారం కన్ను మూశారు. ఈ విషయం ఓ రోజు ఆలస్యంగా బయటకు వచ్చింది. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గత కొన్నాళ్ల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన బాగోగులు ప్రస్తుతం అల్లు అరవింద్ చూసుకుంటున్నారని సమాచారం. త్వరలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం అన్ని సిద్థం చేశారు. కానీ ఇంతలోనే ఇలా ముకేశ్ మరణించడం ఆయన కుటుంబంతో పాటు ఇండస్ర్టీలో విషాదాన్ని నింపింది. ముకేశ్‌కు భార్య కొడుకు ఉన్నారు.
చిరంజీవితో హిందీలో ‘ద జెంటిల్‌మ్యాన్’ సినిమాలు నిర్మించారు ముకేశ్. తెలుగులో అల్లు అరవింద్‌తో కలిసి ‘ఎస్పీ పరశురాం’ సినిమా నిర్మించారు. చేశారు. తొలుత నిర్మాతగా కొనసాగిన ఆయన ఆ తర్వాత లైన్ ప్రొడ్యూసర్ అయ్యారు. ‘గో గోవా గాన్, ఏక్ విలన్, ప్యార్ మైన్ ట్విస్ట్, చష్మే బద్దూర్ చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు.
ముకేశ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
RIP #MukeshUdeshi Ji. Producer. A thorough gentleman. Kind. Very good company. Spent a lot of time with him in Mauritius. Huge loss to the industry. pic.twitter.com/xOnuH99Wqe
— kunal kohli (@kunalkohli) September 12, 2023