News

తండ్రితో లిప్ లాక్, 30 ఏళ్ల తర్వాత అసలు విషయం చెప్పిన నటి.

మహేష్ భట్ నిర్మాతగా ఎంత సక్సెస్ అయ్యారో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ పూజా భట్ కూడా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. మొదట్లో పూజా హీరోయిన్ గా ప్రయత్నించారు. 17 ఏళ్లకే హీరోయిన్ గా మారిన ఆమె అప్పట్లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే మహేష్ భట్ కూతురిగా పూజా భట్ 17 ఏళ్లకే బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయింది.

కానీ పదేళ్లు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా చేసి నటిగా కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది. అప్పట్నుంచి నిర్మాణ రంగం చూసుకుంటుంది పూజా భట్. ఇటీవల మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తుంది. తాజాగా పూజా భట్ వైరల్ అయింది. అందుకు కారణం తన తండ్రికి 30 ఏళ్ళ క్రితం లిప్ లాక్ ఇచ్చిన విషయం గురించి ఇప్పుడు మాట్లాడింది.

30 ఏళ్ళ క్రితం పూజా భట్ తన తండ్రి మహేష్ భట్ కి లిప్ కిస్ ఇస్తూ ఓ మ్యాగజిన్ కి ఫోటోషూట్ చేసింది. అప్పట్లో ఈ ఫోటో వైరల్ గా మారి అందరూ విమర్శించారు. తండ్రికి లిప్ కిస్ ఇవ్వడమేంటి, కూతురితో లిప్ కిస్ ఏంటి అంటూ చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడు పూజా భట్ ఈ విమర్శల వల్ల కొద్దిగా ఇబ్బంది కూడా పడింది.

కానీ ఈ విమర్శలపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా ఈ విషయం జరిగిన దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పూజా భట్ తన తండ్రి మహేష్ భట్ కి ఇచ్చిన లిప్ కిస్ గురించి స్పందించింది. పూజా భట్ మాట్లాడుతూ.. అప్పుడు ఒక మ్యాగజైన్ కోసం, ఒక మంచి పని కోసమే ఆ ఫోటో షూట్ చేశాము. దాని వాళ్ళ నేనెప్పుడూ తప్పుగా ఫీల్ అవ్వలేదు. చాలా మంది విమర్శించారు.

కానీ నేనేమి అవి పట్టించుకోలేదు. పేరెంట్స్ చిన్నప్పట్నుంచి తమ పిల్లలకు ముద్దులు ఇస్తారు. మనం ఎంత పెద్దగా అయినా తల్లితండ్రులకి చిన్నపిల్లలమే. మా నాన్న కూడా నన్ను అలాగే చూస్తారు. షారుక్ కూడా ఈ గొడవ జరిగినప్పుడు ఇదే విషయాన్ని చెప్పాడు. మేము ఒక మంచిపని కోసం చేసిన దాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు జనాలు అని తెలిపింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker