బిగ్ బాస్ లో వచ్చే ఆ గంభీరమైన వాయిస్ ఎవరిదో తెలుసా..?

బిగ్ బాస్ వాయిస్ తోనే అందరినీ ఆకట్టుకుంటూ షోను చూసేలా చేస్తుంది ఆ గొంతు. బిగ్ బాస్ అనే ఆ షో కి ఇంత క్రేజ్ రావడానికి ఈ గొంతు కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అసలు ఈ బిగ్ బాస్ ఎవరు..? బిగ్బాస్ అని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు..? అసలు బిగ్ బాస్ అని చెప్పి వాళ్ల అందరితో గేమ్ ఆడిస్తున్న ఆ స్వరం ఎవరిది..? కనిపించకుండా వినిపిస్తున్న ఆ గొంతు ఎవరిది..?
ఈ గొంతు విని బిగ్ బాస్ షో వచ్చే ప్రతీ రోజు ఈ షో ను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు ప్రేక్షకులు. అయితే హౌసులో రకరకాల వ్యక్తులు వస్తారు. వాళ్లందరినీ కంట్రోల్ చేయాలంటే వాయిస్ గంభీరంగా ఉండాలి. ‘బిగ్‌బాస్’ గొంతు అలానే ఉంటుంది. దాదాపు ఆరు సీజన్ల నుంచి చెబుతూ ప్రస్తుతం ఏడో సీజన్‌లోనూ తన వాయిస్‌తో ఆకట్టుకుంటున్న వ్యక్తి పేరు రాధాకృష్ణ.
ఈయన సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ షో కంటే ముందు ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పి చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సీరియల్స్, అడ్వర్టైజ్‌మెంట్‌లోనూ వినిపించే గొంతు ఇతడిదే. ‘బిగ్‌బాస్’ షోని తెలుగు ప్రారంభిద్దామని అనుకున్నప్పుడు దాదాపు 100 మందిని నిర్వహకులు పరీక్షించారు.
చివరకు శంకర్ గొంతు సరిపోతుందని నిర్ణయానికి వచ్చారు. అయితే ఆయన మాటల్లో గాంభీర్యం నచ్చే, ఛాన్స్ ఇచ్చారట. హౌసులో రోజుకి కొన్ని పదులసార్లు ఆ గొంతు వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ వాయిస్‌ని బయట చాలామంది ఇమిటేట్ కూడా చేస్తుంటారండోయ్. ఇకపోతే రాధాకృష్ణ..

‘బిగ్‌బాస్’తో పాటు గతంలో తెలుగు డబ్ అయిన సీఐడీ సీరియల్‌కి కూడా గాత్రం అందించారు. అయితే తొలి మూడు-నాలుగు సీజన్లలో ఒకలా మాట్లాడిన శంకర్.. ఆ తర్వాత మాడ్యులేషన్ కాస్త మార్చారు. అప్పటి నుంచి దాదాపు ఇలానే కంటిన్యూ అయిపోతున్నారు.