భారతదేశంలో అత్యంత సంపన్న నటి ఎవరో తెలుసా..? ఆమె ఆస్తి ఎంతంటే..?
దాదాపు 15 – 20 ఏళ్ళ నుంచే అన్నీ సినిమా ఇండస్ట్రీలలో పద్ధతులన్నీ మారుతూ వస్తున్నాయి. హీరో, హీరోయిన్స్ మధ్య సందర్భానుసారంగా ముద్దు సన్నివేశాలుంటే వాటిని ఒప్పించడానికి దర్శక నిర్మాతలు చాలా ఆలోచించేవారు. అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ అలా ఉండేది. కాస్త అసభ్యకరమైన సన్నివేశాలుంటే ఆ సినిమాను ఓ బూతు సినిమాగా చూసేవారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌ల రేంజ్, రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క సినిమాకు ఇప్పుడున్న స్టార్ నటీమణులు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.
గతంలో హీరోయిన్‌గా చేసిన వాళ్లు కూడా లక్షల్లో పారితోషికం తీసుకొని కోట్లరూపాయలు కూడబెట్టారు. జయలలిత దక్షిణాది తారగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి 1960లో సూపర్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. తన పెద్ద కళ్లతో మ్యాజిక్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు జయలలిత. తమిళ, తెలుగు పరిశ్రమల్ని శాసించే విధంగా ప్రతీ స్టార్ హీరో పక్కన జోడి కట్టి కోట్లాది రూపాయల ధనాన్ని సంపాదించారు.
1948లో కర్ణాటకలోని మాండ్యలో జన్మించిన జయరామ్ జయలలిత 1961లో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. నాటకరంగం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించి స్టార్ హీరోయిన్‌గా 1960 మధ్య కాలంలో తమిళ, తెలుగు చిత్రాలలో ప్రముఖ నటిగా మారింది. 1968లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ధర్మేంద్రతో కలిసి ‘ఇజ్జత్’ సినిమాలో కనిపించింది. అగ్ర నటిగా ఉంటూనే 1980లో సినిమా నుంచి తప్పుకున్న జయలలిత రాజకీయాల వైపు మళ్లింది.
1997లో జయలలిత రాజకీయ ఖ్యాతి గడించింది. మరోవైపు చెన్నైలోని ఆయన పోజ్ గార్డెన్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు జయలలిత ఇంట్లో సోదాలు జరిపిన ఆ రోజుల్లో నటి ఇంట్లో 10,500 చీరలు, 750 జతల బూట్లు, 91 వాచీలు, 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం సహా స్థిరాస్తులు దొరికాయి. 2016లో మరోసారి ఆయన ఆస్తులపై దాడులు జరిగాయి.
అప్పట్లో నటి జయలలిత వద్ద 1250 కిలోల వెండి, 21 కిలోల బంగారం ఉంది. నటి, రాజకీయ నాయకురాలు జయలలిత రూ. 42 కోట్ల విలువైన చరాస్తులు, 8 వాహనాలను కలిగి ఉన్నారు. నివేదికల ప్రకారం ఆ సమయంలో జయలలిత నికర విలువ రూ.900 కోట్లు, ఆమె ప్రకటించిన రూ.188 కోట్ల కంటే చాలా ఎక్కువ. అందుకే అధికారులు ఆమె ఆస్తుల్ని జప్పు చేశారు. ఆమెపై కేసులు పెట్టారు.