Health

అలాంటివారు గుర్తుపెట్టుకొని మరీ మల్బరీ పండ్లు తినాలి, ఎందుకంటే..?

నిజానికి మల్బరీ పండ్లు విటమిన్లు, పోషకాల బాంఢాగారం. ఈ పండ్లు ఎరుపు, నలుపు, ఊదా, గులాబీ, తెలుపు వంటి ఎన్నో రంగుల్లో ఉంటాయి. తీయని, కొద్దిగా పల్లని రుచిని కలిగున్న ఈ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పండ్లు హిపు వైలెట్ మోరేసి కుటుంబానికి చెందినవి. పలు రకాల ఔషధాలను తయారీలో ఉపయోగించే మూలికల్లో అత్యంత ముఖ్యమైన మూలికా మొక్కలలో ఇది ఒకటి.

కొన్ని ముఖ్యమైన మల్బరీ జాతుల్లో.. స్థానిక ఎరుపు మల్బరీ, తూర్పు ఆసియా తెలుపు మల్బరీ, నైరుతి ఆసియా నలుపు మల్బరీ ముఖ్యమైనవి. మల్బరీ పండినప్పుడు నల్లగా మారుతుంది. పండకపోతే లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇది స్ట్రాబెర్రీ రకానికి చెందిన పండు. మల్బరీ తినడానికి రుచిగా ఉంటుంది. మల్బరీ పండు భారత్‌తోపాటు చైనా, జపాన్, ఉత్తర ఆఫ్రికా, అరేబియా, దక్షిణ ఐరోపా వంటి సమశీతోష్ణ ప్రాంతాలలో పెరుగుతుంది. పట్టు పురుగులకు మల్బరీ ఆకులను మాత్రమే ఆహారంగా పెడతారు.

అందుకే గ్రామాల్లో వీటిని రేష్మే సొప్పు అని కూడా అంటారు. మల్బరీ ఆకులు, బెరడు, పండ్లలలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. మల్బరీ అసాధారణంగా శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. మల్బరీ మొక్కలోని వివిధ భాగాలు పలు రకాల ఔషద లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది వాపును తగ్గిస్తుంది. మల్బరీ జ్వరాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇది కొన్ని రకాల పరాన్న జీవి పురుగులను చంపడంలో సహాయపడుతుంది.

మల్బరీలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మల్బరీ మేలు చేస్తుంది. మల్బరీలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడే ఐరన్‌ను వృద్ధి చేయడంలో మల్బరీ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. మల్బరీ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

వీటిల్లో అధికంగా డైటరీ ఫైబర్ కంటెంట్ ఉంటాయి. బుక్‌వీట్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, ఆంథోసైనిన్స్ పాటు అనేక ఇతర పాలీఫెనోలిక్ సమ్మేళనాలు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మల్బరీ ఆకు రసం గొంతు ఇన్ఫెక్షన్లు, మంట, చికాకుపై ప్రభావ వంతంగా పని చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker