Health

మీరు వారానికి ఒక్కసారైనా వాటర్ యాపిల్ తింటుంటే మీరు జీవితంలో హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం రాదు.

వాటర్ ఆపిల్ ను రోజ్ యాపిల్, గులాబ్ జామూన్ కాయ అని కూడా పిలుస్తారు.నిజానికి ఈ పండు గురించి చాలా మందికి తెలియదు. కాని ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది .ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ ఎ లాంటి చాలా రకాల పోషకాలు మెండుగా ఉన్నాయి. వాటర్ ఆపిల్ తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అయితే వాటర్ యాపిల్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: రోజూ యాపిల్ తినాలని వైద్యులు చెబుతారు.

రెగ్యులర్ గా యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే వాటర్ యాపిల్ పేరు విన్నారా? దీనిని రోజ్ యాపిల్ అని కూడా అంటారు. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల పండు. ఈ పండును సిజిజియం ఆక్వియం అని కూడా అంటారు. ఇది సన్నని పొరతో చిన్న పండు మరియు దాని రంగు ఎరుపు లేదా ఆకుపచ్చగా ఉంటుంది. దీని గుజ్జు సాధారణంగా తెలుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. జ్యుసిగా, తీపిగా ఉంటుంది.

విటమిన్లు సమృద్ధిగా.. ఈ పండు విటమిన్ సి, విటమిన్ ఎ లకు మంచి మూలం. శరీరం మొత్తం ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి మనం రెగ్యులర్ గా వాటర్ యాపిల్ తినాలి. హైడ్రేషన్.. వాటర్ యాపిల్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వేడి లేదా తేమతో కూడిన వాతావరణంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. మీరు చాలా శారీరక శ్రమలు చేస్తుంటే ఈ పండు మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

జీర్ణక్రియలో సహాయాలు.. వాటర్ యాపిల్‌లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ పండును నిత్యం తినేవారికి గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, అసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. వాటర్ యాపిల్‌లో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

ఇంకా, పండులోని యాంటీఆక్సిడెంట్లు హృదయనాళ వ్యవస్థలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బరువు తగ్గడం..పెరుగుతున్న బరువును వీలైనంత త్వరగా తగ్గించుకోవాలనుకునే వారికి వాటర్ యాపిల్ బెస్ట్ ఫ్రూట్. ఇందులో నీరు, పీచు పుష్కలంగా ఉండటం వల్ల కడుపుని ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది. కాబట్టి ఈ పండు అతిగా తినడాన్ని నివారిస్తుంది. దీని కారణంగా, బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker