అందరి ఇళ్లలో ఇదే జరుగుతుంది, పెదవులపై గాయంతో నటి సమీరా.
అభిషేకం, మూడు మూళ్ళ బంధం, ప్రతిబింబం, భార్యామణి, మంగమ్మ గారి మనవరాలు తదితర సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. ఇక నాగబాబు ‘అదిరింది’ షోతో యాంకర్‌గా కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. అయితే సమీరా ఇన్‌స్టాలో రాస్తూ..’ట్రిగ్గర్ హెచ్చరిక. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరినీ బాధపెట్టకూడదు. ప్రతి ఒక్కరి కథకు అవగాహన ఉంటుంది.
ఇది కేవలం జ్ఞాపకశక్తి కోసం క్లిక్ చేసిన చిత్రం. నా ఫీడ్‌లో చేరుతుందని ఎప్పుడూ అనుకోలేదు! కానీ నేను దీని గురించి మీ ఆలోచనలను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇది చూస్తే నేను నా సోదరీమణులు,స్నేహితులు, భర్తతో గొప్పగా గొడవపడినట్లు కనిపిస్తోంది. భర్తకు, భార్యతో కచ్చితంగా ఏదో తప్పు జరుగుతోంది.’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా..’ భర్తతో చాలా మంచి సమయాన్ని గడిపాను. కానీ ఏదో ఒక సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.
నేను అన్వర్ జాన్‌ని వివాహం చేసుకోక ముందు కూడా నా శరీరంపై గాయాలు ఉండేవి. అవి నిజానికి నా మేనల్లుడు అయాన్ చేసినవి. అన్వర్ జాన్ తన మేనల్లుడు ప్రిన్స్ వల్ల గాయాలు అయ్యేవి. కానీ నేను, నా భర్త పెద్దగా గొడవ పడినట్టుగా ఈ పిక్‌లో కనిపిస్తోంది. కానీ ఇది అర్హాన్ పొరపాటుతో జరిగింది. కానీ మీరు ఈ ఫోటో చూడగైనే కచ్చితంగా నా భర్తతో గొడవ వల్లే జరిగి ఉంటుందని అనిపించి ఉండొచ్చు. అవును మేము గొడవపడతాం.
కానీ ఒకరినొకరు విపరీతంగా ప్రేమిస్తాం. మీలో ఎంతమంది జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఈ పోస్ట్‌తో.. మీరు ఎవరినీ జడ్జ్ చేయవద్దనేది నా సలహా.’ అంటూ సమీరా రాసుకొచ్చింది. అయితే సమీరా పోస్ట్‌పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది చిన్న పిల్లలు ఉన్న అందరి ఇళ్లలో జరిగేదే అంటూ గడ్డి పెడుతున్నారు.
దయచేసి ఇలాంటి నాన్‌సెన్స్ పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొందరేమో మాకు కూడా ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయని చెబుతున్నారు. మీరు ఇలాంటి పోస్టులు చేయడం వల్ల వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపొచ్చు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. అసలు ఇలాంటి పోస్టులు పెడుతూ మీ సమయం ఎందుకు వృథా చేసుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.