News

వామ్మో, ఉపాసన వేసుకున్న ఈ డ్రెస్‌ కాస్ట్ ఎంతో తెలిస్తే..?

ప్రతి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే మెగా ఫ్యామిలీ రీసెంట్ గా క్రిస్ మస్ పండుగను కూడా అదే రేంజ్ లో ఫుల్ ఫన్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కే చోట చేరి సందడి చేసారు దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇక ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రాం చరణ్ భార్య ఉపాసన వేసుకున్న డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అభిమానులు ఆ డ్రెస్ గురించి చర్చించుకునేలా చేసింది.

తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ఫారిన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఓ వెడ్డింగ్ కోసం వీరు ఫారిన్ పెళ్లారని తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ ఫారిన్ వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

ఆ సమయంలో ఎంతో సింపుల్ ట్రెండీ వేర్ లో కనిపించింది ఉపాసన.. లైట్ పింక్ కలర్ డ్రెస్‏లో ఎంబ్రయిడరి జాకెట్‏తో స్టైలీష్ లుక్ లో కనిపించారు. అయితే ఉపాసన ధరించిన డ్రెస్ హేలీ మెన్జీస్ డిజైనర్ కు సంబంధించిన పాంథర్ కాటన్ జాక్వర్డ్.. దీని ధర రూ.42,317 ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఫారిన్ వెళ్లడానికి గల కారణాలను ఉపాసన ఇన్ స్టా వేదికగా ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేశారు. ఉపాసన తన ఇన్ స్టా పోస్టులో ఒక వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ ను షేర్ చేశారు. ఈ పోస్టును బట్టి చూస్తే వీరు పెళ్లికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే అది ఎవరి వివాహం అనేది తెలియరాలేదు. మరోవైపు ఈ ఏడాది నవంబర్ లో వరుణ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి పనులను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకోనున్నట్లు తెలుస్తుంది.

ఇక చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది.. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker