7సార్లు అబార్షన్ చేపించి, ఆ నటిని వాడుకుని వదిలేసిన స్టార్ డైరెక్టర్.

తమిళ దర్శక నటుడు సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ, నటి విజయలక్ష్మి 2020 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తన జీవితాన్ని నాశనం చేశాడంటూ అదే ఏడాది జూలైలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఇటీవల ఆమె మరోసారి సీమాన్ పై సంచలన ఆరోపణలు చేయడంతో లైంగిక వేధింపుల ఫిర్యాదు మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
అయితే తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిబ్రవరి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో అతని వేధింపులు తట్టుకోలేక 2020 జూలైలో మాత్రలు మింగిఆత్మహత్యకు ప్రయత్నించింది.
అయితే ఇటీవలే ఆమె మరోసారి సీమాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా వాడుకున్నారని విజయలక్ష్మి ఆరోపించింది. ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడని తెలిపింది. అంతే కాకుండా నా బంగారు నగలు తీసుకుని సీమాన్ మోసం చేశాడని వాపోయింది.
తనకు న్యాయం చేయాలని కోరితే చంపేస్తానని బెదిరిస్తున్నారని ఇటీవల మరోసారి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీమాన్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. మంగళవారం తప్పకుండా విచారణకు హాజరు కావాలని పోలీసులు మరోసారి హెచ్చరించారు.
విజయలక్ష్మికి గైనకాలజిస్ట్ పరీక్ష..విజయలక్ష్మి ఫిర్యాదుతో చెన్నై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. సీమాన్‌ను విచారణకు ఆదేశించడమే కాకుండా.. విజయలక్ష్మికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆమెకు 7 సార్లు గర్భస్రావం జరిగిందని ఆరోపణల నేపథ్యంలో గైనకాలజిస్టులతో వైద్య పరీక్షలు చేశారు.