చూసేందుకు పిచ్చి మొక్కలానే ఉంటుంది. కేన్సర్ సహా ఐదు ప్రాణాంతక వ్యాధులను తగ్గిస్తుంది.

ప్రతీ చిన్న సమస్యకు వైద్యుల వరకు పరుగులు తీయాల్సి వస్తుంది. ఈ సంగతి ఇలాఉంటే.. ఆయుర్వేదంలో అసంఖ్యాక మూలికలు ఉన్నాయి. వాటిలో ఒకటి కల్మేఘం(నేలవేము). ఇందులోని ఔషధ గుణాలు.. అనేక రకాల జబ్బులను నయం చేస్తుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మూలికలలో ఇది కూడా ఒకటి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు. అయితే అందుకే భారతదేశంలో ఆయర్వేదశాస్త్రం అనాదిగా ప్రాచుర్యంలో ఉంది.
ఆయుర్వేద మూలికలతో చాలా రకాల వ్యాధుల్ని దూరం చేసే చికిత్సా విధానముంది. అటువంటిదే ఈ మొక్క. నేలవేము మొక్కగా పిల్చుకునే ఈ మొక్కతో ఏకంగా 5 వ్యాధులను నయం చేయవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. నేలవేము ఒక రకమైన ఔషధ మొక్క. ఇంట్లో కుండీలలో కూడా పెంచుకోగలిగే ఈ మొక్క వేప కంటే చేదుగా ఉంటుంది. ఈ మొక్క కాండంలోను, ఆకులోను ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇంగ్లీషులో గ్రీన్ చిరెట్టా అని పిలుస్తారు. ఈ మొక్క సహాయంతో చాలా రకాల వ్యాధులు పరిష్కారమౌతాయి. కాలమేఘ్ మొక్క అని హిందీలో పిలుస్తుటారు.
కేన్సర్..కేన్సర్ అనేది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధి. ప్రారంభదశలో గుర్తించలేకపోతే ప్రాణాలు పోతుంటాయి. నేలవాము మొక్క ఆకులు లేదా కాండం రోజూ క్రమం తప్పకుండా నీళ్లలో కాచి తీసుకోవడం లేదా పేస్ట్ చేసి గుళికల్లా తీసుకుంటే కేన్సర్ ముప్పు సైతం తగ్గుతుందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. బాడీ పెయిన్స్..తరచూ బాడీ పెయిన్స్ రావడం సహజమే. ఒక్కోసారి భరించలేనంతగా బాడీ పెయిన్స్ బాధిస్తుంటాయి. విశ్రాంతి తీసుకున్నా సరే ఫలితముండదు.
ఈ పరిస్థితుల్లో నేలవాము మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఎనాల్జెసిక్ గుణాలు స్వెల్లింగ్, నొప్పులతో పాటు ఐరన్ లోపాన్ని దూరం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్..నేలవాము మొక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా వివిధ రకాల అంటువ్యాధుల్నించి రక్షణ పొందవచ్చు. జ్వరం, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. గొంతు ఇన్‌ఫెక్షన్ దూరం చేసేందుకు ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది.
లివర్ వ్యాధులు..లివర్ అనేది మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం. శరీరంలో వివిధ రకాల పనులు చేస్తుంటుంది. అందుకే లివర్ ఆరోగ్యం చాలా అవసరం. రోజూ నిర్ణీత మోతాదులో నేలవాము మొక్కను సేవిస్తుంటే లివర్ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్తి..ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కారణంగా జీర్ణక్రియ చాలామందికి పాడైపోతుంటుంది. తీసుకున్న ఆహారం జీర్ణమవడంలో సమస్యగా ఉంటుంది. గ్యాస్ సమస్య రావచ్చు. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు నేలవాము మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది.