News

మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా..? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి.

కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డ్ సేవలను క్యాష్ బ్యాక్‌లు , డిస్కౌంట్‌లు , రివార్డ్ పాయింట్‌లు మొదలైన వాటి ద్వారా డబ్బును ఆదా చేయడానికి ఒక అద్భుతమైన ఆర్థిక సాధనంగా పిచ్ చేస్తాయి. అయితే క్రెడిట్ కార్డ్‌లను తెలివిగా ఎలా ఉపయోగించాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాస్తవానికి, మీరు క్రెడిట్ కార్డ్‌లను తెలివిగా ఉపయోగిస్తే వడ్డీగా ఒక్క పైసా కూడా చెల్లించకుండా వాటితో అనుబంధించబడిన అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

అయితే మనలో చాలా మంది క్రెడిట్ కార్డును స్టేటస్​సింబల్​గా ఉపయోగిస్తూ ఉంటారు. అవసరం ఉన్నా, లేకున్నా పరిమితికి మించి ఖర్చు చేస్తారు. అయితే దీని వల్ల మన క్రెడిట్​స్కోర్ దెబ్బతీస్తుంది. బ్యాంకు ద్వారా మనం లోన్ పొందాలంటే వారు ముందుగా క్రెడిట్ స్కోరును పరిశీలిస్తారు. దాన్ని బట్టే ఆ వ్యక్తికి లోన్ ఇవ్వచ్చా..? లేదా? అనేది నిర్ణయిస్తారు. ఒక క్రెడిట్​ స్కోర్​ తక్కువగా ఉంటే బ్యాంకులు మీకు అప్పు ఇచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. అదే విధంగా వడ్డీ రేట్లలో రాయితీ పొందాలన్నా కూడా మంచి క్రెడిట్​ స్కోర్​కలిగి ఉండాలి.

వాస్తవానికి వీటన్నింటినీ మన క్రెడిట్​కార్డ్​వినియోగం ప్రభావితం చేస్తుందని మనలో చాలా మందికి తెలియదు. అందుకే క్రెడిట్​కార్డ్​ వినియోగంపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలి. క్రెడిట్​ కార్డు బిల్లులు, బ్యాంకు అప్పులు ఎలా చెల్లిస్తున్నారు అనే దానిపై క్రెడిట్​స్కోర్​ ప్రభావితం అవుతుంది. సరైన సమయంలో బిల్లులు చెల్లిస్తుంటే, క్రెడిట్​స్కోర్​మంచిగా పెరుగుతుంది. కేవలం ఒక్క రోజు ఆలస్యమైనా మన క్రెడిట్​స్కోర్ పడిపోతుంది. అంతేకాకుండా క్రెడిట్​బిల్లులపై ఎక్కవగా వడ్డీ చెల్లించాలి.

ఇది అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది తమ క్రెడిట్​ కార్డును లిమిట్ ఉన్నంత మేరకు ఊడేశ్చాస్తారు. అలా కాకుండా.. కార్డు పరిమితిలో 30 నుంచి 40 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. ముఖ్యంగా తక్కువ పరిమితి ఉన్న కార్డుల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా క్రెడిట్ కార్డులు వాడటం వలన వాటిని మెయిన్ టెన్ చేయడం కష్టంగా మారుతుంది. ఒక్క బిల్లు మరిచిపోయినా, క్రెడిట్​స్కోర్​తగ్గిపోతుంది.

అంతే కాకుండం ఎక్కువ డబ్బులు వడ్డీల రూపంలో కట్టాల్సి వస్తుంది. ఇకపోతే క్రెడిట్ కార్డు ఉంది కదా అని.. ఏది పడితే అది కొనేయడం చేస్తే.. ఆ తర్వాత బొక్క పడేది మనకే. అందుకే ఎమర్జెన్సీ టైంలో వాడటం మంచిది. మరో విషయం ఏంటంటే కనీస మొత్తాలు వాడుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో రుణాలు చెల్లించాలి. లేదంటే వడ్డీ భారం పడుతుంది. దీంతో క్రెడిట్​స్కోర్​తగ్గిపోయి భవిష్యత్​లో బ్యాంకుల నుండి రుణాలు మంజూరు చేసే అవకాశం బాగా తగ్గిపోతుంది. సో జాగ్రత్త.. క్రెడిట్ వాడకం కొద్దిగా తగ్గిస్తే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker