ఘోర రోడ్డు ప్రమాదం, ప్రముఖ నటుడు మృతి.
త్రిసూర్ సమీపంలో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. వటకరలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్నారు కొల్లం సుధీ. ఈ సమయంలో కారు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. తీవ్రంగా గాయపడిన కొల్లం సుధీ చనిపోయారు. అయితే కొన్నిరోజుల క్రితమే బాలీవుడ్ నటి వైభవి ఉపాధ్యాయ వెకేషన్ నుంచి తిరిగి వస్తుండగా కారు బోల్తా పడి ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
ఇంకా ఈ ఘటనను అభిమానులు మరిచిపోకముందే మరో ఘోర రోడ్డుప్రమాదంలో నటుడు మృతి చెందాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. పలు మలయాళ సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు కొల్లం సుధీ. తన స్నేహితులతో కలిసి ఆయన వస్తున్న కారు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కొల్లం సుధీ, అతని స్నేహితులు బిను ఆదిమాలి, మహేష్, ఉల్లాస్ తో కలిసి పటకార ప్రాంతంలో జరిగిన ఒక ఈవెంట్ కు వెళ్లారు. ఈవెంట్ ను ముగించుకొని తెల్లవారు జామున కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో వారు కారును ఒక కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొడుతూ కొద్దిదూరంలో వెళ్ళిపడింది.
ఈ ప్రమాదంలో సుధీ తలకు తీవ్ర గాయమైంది. ఇక స్నేహితులు వెంటనే పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించగా.. ప్రాణాలతో పోరాడుతూ సుధీ కన్నుమూశారు. మిగిలిన ముగ్గురు తీవ్రగాయాలతో బయటపడ్డారు. సుధీ వయస్సు 39. మంచి భవిష్యత్తు ఉన్న ఆయన ఇంత చిన్న వయస్సులోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.
కొల్లం సుధీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.