Health

రాత్రివేళ రెండుమూడుసార్లు మూత్ర విసర్జన కోసం లేస్తున్నారా…? ఆ ప్రమాదకర జబ్బులకు సంకేతం కావొచ్చు.

రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటే ముందుగా మూత్రాశయాన్ని పరీక్షించుకోవాలి. మూత్రాశయం లోపల రాళ్లు ఉండటం వల్ల తరచుగా మూత్రవిసర్జన అవుతుంది. వాస్తవానికి ఇది మూత్ర విసర్జనలో అడ్డంకి మారుతుంది. దీనివల్ల కూడా తరచుగా మూత్రం వస్తుంది. అయితే ఆరోగ్యకరమైన జీవితానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, నాణ్యమైన నిద్ర కూడా అంతే అవసరం. కానీ కొంతమందికి రాత్రిపూట రెండు నుంచి మూడుసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల వారికి నిద్రా భంగం కలుగుతుంది.

తిరిగి నిద్ర పట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర సరిపోక చాలా చికాకుగా ఉంటారు. నిద్ర సరిపోకపోతే ఆ రోజంతా వెలితిగా అనిపిస్తుంది. ఇలా పదే పదే అర్ధరాత్రి లేవడాన్ని అడల్ట్ నాక్టూరియా అని పిలుస్తారు. రాత్రి మూత్ర విసర్జన కోసం ఒకసారి మాత్రమే లేవడం సహజం. రెండుసార్లు లేస్తున్నారంటేఅది అడల్ట్ నాక్టూరియాగా చెప్పుకోవాలి. ఇది నిద్రను తీవ్రంగా ప్రభావితం చేసే సమస్య. వయసు పైబడిన వారిలో ఇది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన వారిలో కూడా కనిపిస్తోంది.

నాక్టూరియా సమస్య రావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి బ్లాడర్ సామర్థ్యం తగ్గిపోవడం, రెండోది మూత్రం అధికంగా ఉత్పత్తి కావడం. మూత్రం అధికంగా ఉత్పత్తి కావడానికి పాలీయూరియా అని పిలుస్తారు. యాంటీ డయోరిటిక్ హార్మోన్ విడుదల శరీరంలో తగ్గిపోవడం వల్ల మూత్రం ఉత్పత్తి పెరిగిపోతుంది. ఇక బ్లాడర్ అనేది మన శరీరంలో ఒక అవయవం. ఇది 300 నుంచి 600 మిల్లీలీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ సామర్థ్యం తగ్గిపోయినప్పుడు ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. శరీర బరువు పెరగడం.

పెల్విక్ వ్యవస్థలో మార్పులు రావడం వంటి వాటి వల్ల కూడా ఈ బ్లాడర్ సామర్థ్యం తగ్గిపోయి, రెండు మూడు సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇవి కాకుండా డయాబెటిస్ ఉన్న వారిలో కూడా మూత్ర విసర్జనకు అధికంగా వెళ్లాల్సి రావచ్చు. గుండె జబ్బులు ఉన్నవారు, అధికంగా ద్రవాలు తీసుకున్న వారు, ఆల్కహాల్, ధూమపానం వంటివి చేసేవారు, సిరల పనితీరు క్షీణించినప్పుడు కూడా మూత్రం అధికంగా ఉత్పత్తి అవుతుంది. కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా బ్లాడర్ సామర్థ్యం తగ్గిపోయి మూత్ర విసర్జన పదేపదే రావచ్చు.

బ్యాక్టీరియా సమస్యతో బాధపడుతున్న వ్యక్తి తన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా రాత్రిపూట మూత్ర విసర్జనకు ఒకసారి కంటే ఎక్కువ వెళ్లకుండా అడ్డుకోవచ్చు. నిద్రపోవడానికి కొన్ని గంటల ముందు ద్రవాహారాలను తీసుకోవడం తగ్గించాలి. రాత్రిపూట ఆల్కహాల్ తాగకూడదు, కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. అధిక బరువును తగ్గించుకోవాలి. పడుకోబోయే ముందు మూత్ర విసర్జన చేయాలి. డయాబెటిస్ వంటి సమస్యలు ఉంటే దానికి తగ్గ చికిత్సలు తీసుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker