Health

పొట్టు ఉన్న పెసరపప్పును తింటే గుండెకు ఎంత మంచిదో తెలుసుకోండి.

పెసర పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్స్ బీ9, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బీ4 , ఫాస్పరస్, పొటాషియం, జింక్, ఐరన్, విటమిన్ బీ2, బీ3, బీ5, బీ6 పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ప్రోటిన్స్ అధికంగా ఉన్నాయి. మొలకెత్తిన పెసరపప్పును ఉదయాన్నే తింటే శరీరానికి అధికమొత్తంలో ప్రోటీన్స్, ఆమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అయితే సూపర్ మార్కెట్లలో పొట్టు తీసిన పెసరపప్పుతో పాటు, పొట్టు తీయని పెసరపప్పు కూడా దొరుకుతుంది. ఎక్కువమంది పొట్టు తీసిన పెసరపప్పునే వినియోగిస్తారు.

పొట్టు తీయని పెసరపప్పును తీసుకుని రాత్రంతా నానబెడితే ఉదయానికి మొలకలు రావడం జరుగుతుంది. ఆ మొలకలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యం. అలాగే ఆ పెసరపప్పును రుబ్బి చిన్న అల్లం ముక్క వేసి జీలకర్ర కలిపి పేస్టులా చేసుకుని… దాంతో దోశెలు వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇలా పెసరపప్పుతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. పెసరపప్పును తినడం వల్ల కొవ్వు పెరగకుండా ఉంటుంది. మన శరీరానికి రోజువారి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. అలాగే ఐరన్ వంటివి కూడా అందుతాయి. దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తింటే మలబద్ధకం లక్షణాలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు పెసరపప్పును ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పొట్టు ఉన్న పెసరపప్పుతో చేసిన వంటకాలు తరచూ తింటూ ఉంటే గుండె జబ్బుల బారిన పడే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. తద్వారా గుండెపోటు రాకుండా ఉంటుంది. పొట్టు ఉన్న పెసరపప్పులో మెగ్నీషియం, పొటాషియం, రాగి, మాంగనీస్, భాస్వరం, విటమిన్ బి, విటమిన్ బి2, విటమిన్ బి3 ముఖ్యమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. పెసర పప్పులోనే కాదు ఆ పప్పు పైన ఉండే పొట్టులో కూడా ఇవన్నీ లభిస్తాయి. పొట్టు ఉన్న పెసరపప్పు క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి తింటే బరువు పెరుగుతారన్న బెంగ లేదు. అలాగే పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది.

దీనివల్ల ఇతర ఆహారాలను తక్కువగా తింటారు. దీని వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. మహిళల ఆరోగ్యానికి కూడా పొట్టు ఉన్న పెసరపప్పు చాలా అవసరం. దీనిలో థయామిన్, ఫోలేట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మహిళ శరీరానికి అవసరమైనవే. గర్భిణీలు పొట్టు ఉన్న పెసరపప్పును తింటే బిడ్డలు న్యూరల్ ట్యూబ్ లోపాలు రాకుండా ఉంటాయి. అలాగే ఆటిజం వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. బిడ్డకు గుండె జబ్బులు వచ్చే ఛాన్సులు కూడా తగ్గుతాయి. గర్భిణీలకు రిబోఫ్లావెన్ చాలా ముఖ్యం. దీని కోసం పెసర పప్పును తింటే మంచిది. ప్రాణాంతక పరిస్థితులు రాకుండా పెసరపప్పు అడ్డుకుంటుంది.

అలాగే బిడ్డలకు పుట్టుకతో వచ్చే లోపాలను కూడా రాకుండా నిరోధిస్తుంది. ఎముకలను, కండరాలను బలంగా మారుస్తుంది. మహిళలు ఈ పొట్టు ఉన్న పెసరపప్పును తరుచూ తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు పొట్టు తీయని పెసరపప్పుతో చేసిన వంటకాలు తరచూ తినడం చాలా అవసరం. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అన్ని అవయవాలకు రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. వీటిని తింటే రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలకు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. గుండెను కూడా రక్షించుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker