Health

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే మీలో ఈ లోపం ఉన్నట్టే..?

క్రమరహిత హృదయ స్పందన హైపోకాల్సెమియా యొక్క లక్షణం. దీని వల్ల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. కాల్షియం లోపం గుండె కండరాలపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. గుండె కణాలకు తగినంత కాల్షియం లభించకపోతే, అవి పనిచేయడం మానేస్తాయి. అయితే ఎంతోమందిలో కాల్షియం లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో 30 ఏళ్లు దాటగానే కాల్షియం లోపం వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. చిన్న చిన్న వస్తువులను కూడా ఎత్తలేరు. అలాగే దంతాల సమస్యలు కూడా వస్తాయి. గోళ్లు విరిగిపోవడం వంటివి జరుగుతాయి. తల తిరుగుతున్నట్టు అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

వేళ్లు, పాదాలు, కాళ్లల్లో తిమ్మిర్లు వస్తాయి. బద్దకంగా అనిపిస్తుంది. తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. గోళ్లు పెళుసుగా మారిపోతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. తికమక పడుతుంటారు. ఆకలి కూడా వేయదు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు కాల్షియం లోపం ఉన్నట్టు అర్థం. వెంటనే వైద్యులను కలిసి కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలి. లేదా కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను రోజు తింటూ ఉండాలి. చాలామందికి పాలు తాగడం ఇష్టం ఉండదు. కానీ పాలల్లో పుష్కలంగా అందుతుంది. పాలు తాగగలిగే వాళ్ళు రోజూ గ్లాసుడు పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. ఆహారంలో కచ్చితంగా పెరుగు ఉండేలా చూసుకోవాలి.

పాలు, పెరుగు ఇష్టపడని వారు కాల్షియం ఉన్న ఇతర ఆహార పదార్థాలపై ఆధారపడాలి. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఈ రెండింటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక స్పూను తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు వేయాలి. అలాగే ఖర్జూరాలలో కూడా కాల్షియం, ఐరన్ రెండూ ఉంటాయి. కాబట్టి రోజుకు మూడు ఖర్జూర పండ్లను తినడం అలవాటు చేసుకోండి. ఇది కాల్షియం, ఐరన్ లోపాలను పరిష్కరించడమే కాదు, రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తుంది. అవిసె గింజలు కూడా తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి.

వాటిలో కాల్షియంతో పాటు ఒమెగా ఫ్యాటీ 3 ఆమ్లాలు, ప్రోటీన్ కూడా ఉంటుంది. వీటిని ప్రతిరోజూ పొడి రూపంలో లేదా అవిసె గింజలతో చేసిన లడ్డూల రూపంలో తినండి. కాల్షియం లోపం తగ్గుతుంది. మినరల్ వాటర్ లో కూడా కాల్షియం కలుపుతున్నారు. కాబట్టి కాల్షియం ఉన్న మినరల్ వాటర్ తాగేందుకు ప్రయత్నించండి. గసగసాల వాడకం చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఈ గసగసాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి వంటకాలలో అర స్పూన్ గసగసాలు వేసి తినేందుకు ప్రయత్నించండి. మెంతికూర, మునగాకుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిలో తరచూ తినేందుకు ఇష్టపడండి.

గుడ్లు కూడా కాల్షియానికి మంచి మూలం అనే చెప్పాలి. బీట్రూట్, పాలకూర, సోయాబీన్స్, బాదం, జీడిపప్పు వంటి వాటిల్లో కూడా క్యాల్షియం లభిస్తుంది. పొద్దుతిరుగుడు గింజల్లో కూడా కాల్షియం ఉంటుంది. ఈ విత్తనాలను బ్రేక్ ఫాస్ట్ కు ముందు తినడం అలవాటు చేసుకోండి. శరీరం కాల్షియం పుష్కలంగా గ్రహించాలంటే దానికి విటమిన్ డి అవసరం. కాబట్టి విటమిన్ డి లోపం ఉన్న కూడా కాల్షియం లోపం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్య రశ్మి తగిలేలా చూసుకోండి. దీనివల్ల శరీరం విటమిన్ డి ని గ్రహిస్తుంది. విటమిన్ డి వల్ల కాల్షియం శోషించుకునే శక్తి శరీరానికి వస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker