రాత్రుళ్ళు సరిగా నిద్రలేకుంటే.. మీ దాంపత్య జీవితం సర్వనాశనం అవుతుంది.
మీకు, మీ భాగస్వామికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకునేలా ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. లేదంటే ఇద్దరి మధ్య సంబంధాలు రోజురోజుకీ క్షీణిస్తాయి. కొన్నిసార్లు ఇవి మరింత ముదిరిపోయే అవకాశం ఉంది. దీని ప్రభావం ఇద్దరి పైనే కాదు… కుటుంబం, పిల్లలపైనా పడుతుంది. ఇలాంటివి ఎదురైనప్పుడు మీరు కొన్ని పద్ధతులు పాటిస్తే ఇద్దరూ సులభంగా కలిసిపోవచ్చు. అయితే ప్రతి మనిషి జీవితంలో సుఖంగా ఉండాలంటే ఎనిమిది గంటల మంచి నిద్ర అవసరం. నిద్ర సరిగా పట్టకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసిందే. కానీ మీరు సరిగ్గా నిద్రపోకపోతే అది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.
అవును, నిద్ర లేకపోవడం మీ సంబంధంలో ఒత్తిడిని ఎలా పెంచుతుందో చూడండి. కోపాన్ని పెంచుతుంది.. నిద్రలేమి మీ కోపాన్ని పెంచుతుందని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. అవును నిద్ర సరిగా పట్టలేదు, ఉదయం లేచే సరికి మూడ్ సరిగా లేదు. కోపం వస్తుందని చాలా మంది చెబుతున్నారు. నిద్ర సరిగా లేకపోతే కోపం ఎక్కువ అవుతుంది. సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.. కోపం, ప్రతికూల మానసిక స్థితి సంబంధంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. సరైన నిద్ర లేకుంటే మూడ్ బాగోలేనప్పుడు భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ దానికి చిరాకు పడతారు. గొడవలు పెట్టుకుంటారు. ఇది సంబంధానికి మంచిది కాదు.
పరిశోధన ఏం చెబుతోంది?.. 700 మందిపై నిర్వహించిన పరిశోధనలో నిద్ర లేకపోవడం వల్ల సంబంధాల నాణ్యత తగ్గిపోతుందని సూచిస్తున్నారు. అంతా గొడవలే అయితే జీవితం ఏం బాగుంటుంది. బంధం ఎప్పుడు బలపడుతుంది. నిద్ర లేకుంటే ఎక్కువ గొడవలు అవుతున్నాయని చాలా జంటలు చెప్పాయి. తగ్గిన ప్రేమ.. తగినంత నిద్ర లేని వ్యక్తులు తాజా మూడ్‌లో ఉండరు. వారికి మానసిక కల్లోలం తరచుగా ఉంటుంది. దేనిపైనా ఆసక్తి లేకపోతే దంపతుల మధ్య ప్రేమ అభివృద్ధి ఉండదు. బయటకు వెళ్దామన్నా ఇంట్రస్ట్ చూపించరు.
అలా ఇంట్లోనే ఉండాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఫోన్ చూస్తూ ఉంటారు. జీవిత భాగస్వామిని ప్రభావితం చేస్తుంది.. నిద్ర లేకపోవడం వల్ల, ప్రతికూల భావోద్వేగాలు ఆధిపత్యం చెలాయిస్తాయని పరిశోధకులు చెప్పారు. మీ మానసిక స్థితి మీరు మాట్లాడే విధానంలో ప్రతిబింబిస్తుంది, ఇది భాగస్వామిని ప్రభావితం చేస్తుంది. ఏది మాట్లాడినా చిరాకు పడుతుంటారు. ప్రతీదానికి గొడవ చేస్తుంటారు. నిద్రలేమి వల్ల ఏమవుతుంది?..నిద్రలేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి. వాటిలో ఒత్తిడి లేదా నిరాశ కూడా ఉంది. ఈ సమస్యలన్నీ ఉంటే కుటుంబం బాగుండదు.
ఇలానే కంటిన్యూ అయితే ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి వస్తుంది. మంచి నిద్ర కోసం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. కెఫిన్ తీసుకోవడం తగ్గించండి. వ్యాయామం చేయండి. అలాగే మీ భాగస్వామితో సమస్యను పంచుకోండి. లేకుంటే మీ సంబంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. సరైన నిద్రతో మీ భాగస్వామితో హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నించాలి. నిద్రలేమితో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసికంగానూ, శరీరంగానూ వీక్ అయిపోతారు. అందుకే తగినంద నిద్రపోవడం అనేది కచ్చింతంగా ఉండాలి.