మహిళలకు అద్దిరిపోయే శుభవార్త, భారీగా తగ్గిన బంగారం ధరలు.
బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గోల్డ్ రేటు బాటలో వెండి ధర కూడా పయనించింది. అందువల్ల బంగారం ,వెండి ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగిరావడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నాయి.
అందుకే గారం ధరలు దిగి వచ్చాయని తెలియజేస్తున్నారు. అయితే శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,800 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,870 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.300, 24 క్యారెట్లపై రూ.330మేర తగ్గింది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.
ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.74,300 గా కొనసాగుతోంది. నిన్నటి కంటే ఇవాళ రూ.200 తగ్గడం గమనార్హం. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,870 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 పలుకుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 లుగా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250 లుగా ఉంది.