News

రోహిణికి సర్జరీ ఎందుకు చేసారో తెలుసా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?

ఆరేళ్ల క్రితం రోహిణికి వైజాగ్ లో ఓ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఆమెకు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ కుడి కాలిలో రాడ్ వేశారు. మూడేళ్ళ తరవాత ఆ రాడ్ తీసేయాలి. కానీ రోహిణి కెరీర్‌లో బిజీగా ఉండటంతో కాలిలో ఉన్న రాడ్ తీయించుకోవడం కుదర్లేదు. ఇప్పుడు ఆరేళ్ళ తర్వాత అది తీయించుకోవడానికి వెళ్లగా.. సర్జరీ మొదలుపెట్టిన డాక్టర్లు కాలిలో ఉన్న రాడ్‌ను తీయలేకపోయారు. చాలా కాలం కావడంతో లోపల స్కిన్‌కు రాడ్ అతుక్కుపోయిందని.. తీయడంకుదరదని చేతులెత్తేశారు అంటూ ఓ వీడియోలో చెప్పింది.

అయితే నటి శ్రీవాణికి అప్పట్లో గొంతు సమస్యలు రావడంతో దాని మీదా స్పెషల్ వీడియోలను షేర్ చేశారు. ఇలా సందర్భం ఏదైనా కూడా యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేయడం, వాటికి వింత వింత థంబ్ నెయిల్స్ పెట్టి వ్యూస్ రాబట్టుకోవడం, తద్వారా డబ్బులు సంపాదించుకోవడం అలవాటైంది. ఇప్పుడు రోహిణి సైతం ఆ దారిలోనే నడుస్తోంది. తన కాలికి సర్జరీ జరిగిందని, తాను ఇప్పుడు ఎలా ఉన్నానో చెబుతూ.. వీడియోను షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియోలో రోహిణి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో తనకి సర్జరీ జరిగిందని రోహిణి చెప్పుకొచ్చింది. రాడ్‌ను తొలగించడానికి డాక్టర్లు చాలా శ్రమించారని తెలిపింది. సర్జరీకి దాదాపు పది గంటల సమయం పట్టిందని రోహిణి పేర్కొంది. ఆరు వారాలపాటు కాలును కిద్ద పెట్టకూడదు, దాని మీద బరువు పెట్టకూడదని వైద్యులు సూచించారట.

తాను పూర్తిగా కోలుకోవడానికి మూడు నుంచి ఐదు నెలలు పడుతుందని రోహిణి చెప్పుకొచ్చింది. రోహిణికి దాదాపు ఆరేళ్ల క్రితం యాక్సిడెంట్ జరిగిందట. అప్పుడు విశాఖపట్నంలో డాక్టర్ శ్రీధర్.. కుడి కాలిలో రాడ్ వేశాడట. కొంతకాలం తరవాత ఆ రాడ్ తీసేయాలని, కానీ కెరీర్‌లో బిజీగా ఉండటంతో ఖాళీ సమయం దొరకక రోహిణికి కాలిలో ఉన్న రాడ్ తీయించుకోవడం కుదర్లేదట. ఇన్నేళ్లకు కాస్త సమయం దొరకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లిందట.

అక్కడ మొత్తానికి సర్జరీ చేయించుకుందట. ఇప్పుడు ఆమె పూర్తిగా క్షేమంగానే ఉన్నారట. కాకపోతే ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker