News

ముఖంపై తీవ్ర గాయాలతో కీర్తి సురేష్, ఏం జరిగిందో తెలిస్తే..?

ప్రస్తుతం కీర్తి భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో చిరంజీవి చెల్లిగా కనిపించనుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తాలో జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో కీర్తి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అయితే నేటితరం మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న కీర్తి సురేష్ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి షాకిచ్చింది. ఈ వీడియోలో ముఖంపై గాయాలతో కలిపించి ఆశ్చర్యపరిచింది. కీర్తి ఎడమ కంటికి గాయమైనట్లుగా ఈ వీడియో స్పష్టం చేస్తోంది.

దీంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే తన అభిమానులను ఎక్కువగా టెన్షన్ పెట్టకుండా అసలు విషయం కూడా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కీర్తి సురేష్. తాను గతంలో నటించిన సాని కాయిదం సినిమా కోసం ఇలా మేకప్ అయినట్లు ఆమె చెప్పింది. కీర్తి సురేష్, డైరెక్టర్ సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో ఈ సాని కాయిదం మూవీ తెరకెక్కి గతేడాది విడుదలైంది. 2022 మే 6న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా వచ్చింది.

అయితే ఈ మూవీ వచ్చి ఏడాది అయిన సందర్భంగా షూటింగ్ కు సంబంధించిన వీడియో, ఫోటోస్ షేర్ చేసింది కీర్తి సురేష్. ఈ మూవీ సమయంలో పడిన కష్టాలను వివరిస్తూ నోట్ రాసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సినిమా కోసం కీర్తి కష్టం, డేడికేషన్ చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటి అని ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేష్.

వైవిధ్యభరితమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గానే నానితో దసరా సినిమా చేసి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనదైన కట్టు, బొట్టుతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది కీర్తి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది కీర్తి సురేష్. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది.

మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ బాణీలు కడుతున్నారు. ఈ మూవీలో చిరంజీవి చెల్లిగా కనిపించనుంది కీర్తి సురేష్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన కీర్తి సురేష్ లుక్ ఆమె అభిమానుల్లో సినిమా పట్ల క్యూరియాసిటీ పెంచేసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker