News

ఓయోలో రూమ్ బుక్ చేసుకొని వెళ్ళాడు, అక్కడ పెద్ద పెద్ద శబ్దాలతో ఏం జరిగిందో తెలుసా..?

భద్రతా చర్యలను పటిష్టం చేయడానికి హోటళ్లలో అధిక నాణ్యత గల సీసీటీవీలను అమర్చాలని ఓయో హోటల్ యాజమాన్యాన్ని పోలీసులు ఆదేశించారు. ఈ సీసీటీవీ కెమెరాలు కనీసం ఒక నెల పాటు రికార్డింగ్‌ను అందుబాటులో ఉంచుతాయి అయితే ఈ రోజుల్లో హోటళ్లను బుక్ చేసుకోవడానికి ఓయో వంటి సులభమైన యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ల ద్వారా హోటల్ రూమ్స్ ని ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అయితే OYO హోటల్‌ని బుక్ చేసుకునే ముందు 10 సార్లు ఆలోచించేలా ఓ సంఘటన జరిగింది.

ఓయోలో రూమ్ లో బుక్ చేసుకున్న ఓ వ్యక్తి..తనకు ఎదురైన వింత అనుభవం గురించి ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. అమిత్ చన్సికర్ అనే వ్యక్తి బెంగుళూరులో ఓయో హోటల్ ను బుక్ చేశాడు. ప్రముఖ ట్రావెల్ బుకింగ్ యాప్ మేక్‌ మై ట్రిప్ ద్వారా అమిత్ ఓయో హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాడు. బెంగళూరు ట్రాఫిక్ లో పాపం అష్టకష్టాలు పడి తాను బుక్ చేసుకున్న హోటల్ అడ్రస్ కి అమిత్ చేరుకున్నాడు. హోటల్‌కు చేరుకోగానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

ఎందుకంటే అక్కడ హోటల్ నిర్మాణంలో ఉంది. పనివాళ్లు వర్క్ చేస్తూ ఉండగా పెద్ద పెద్దలు శబ్దాలు విని అమిత్ షాక్ అయ్యాడు. నిర్మాణంలో ఉన్న హోటల్ ఎలా బుకింగ్ కి ఎలా ఉంచారు రా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ట్విట్టర్ లో అమిత్ పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. అమిత్ తన పోస్ట్‌లో.. “నేను బుక్ చేసిన హోటల్ పునర్నిర్మాణంలో ఉందని తెలిసింది. ఇది మోసంతో సమానం.

రెండు గంటలు వృధా తర్వాత, వారు నా రీఫండ్ నుండి డబ్బును కూడా తగ్గించారు. వాళ్ళు సిగ్గుపడాలి!“అని తెలిపారు. తన బుకింగ్ రసీదు స్నాప్‌షాట్‌ను కూడా పోస్ట్‌లో షేర్ చేశాడు. మరో పోస్ట్‌లో అమిత్,.“OYO, MMT ప్రతినిధులు ఇద్దరూ కాల్‌లు, ఈమెయిల్‌ల ద్వారా తనను చాలాసార్లు సంప్రదించారు.. స్పష్టంగా రీఫండ్ ప్రాసెస్ చేయబడింది, కానీ ఇంకా ఖాతాకు చేరుకోలేదు. ఇది జరిగిన వెంటనే ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది అని అమిత్ తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker