News

వాళ్ళు నా వెంట్రుకతో సమానం అంటూ కోపంతో ఊగిపోయిన హరీష్ శంకర్.

మాహారాజా రవితేజ నటించిన సినిమా ‘ఈగల్’ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ రెండు రోజుల్లోనే 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ వెబ్ సైట్ పై మండిపడ్డాడు. అయితే సక్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్‌తో పాటు రవితేజతో బచ్చన్ మూవీ తెరకెక్కిస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఈ సినిమా రివ్యూ ఇచ్చిన ఓ వెబ్ సైట్‌పై ఫైర్ అయ్యాడు.‘అందరికీ అన్ని సినిమాలు నచ్చాలని రూల్ లేవు. ఇండస్ట్రీ అంటే కేవలం యాక్టర్స్, టెక్నీషియన్లే కాదూ .. జర్నలిస్టులు కూడా. సినిమా నచ్చకపోతే.. వదిలేయండి..ఇలాంటి రేటింగ్స్, ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటీ. క్రిటిసిజం, ట్రోలింగ్‌కు తేడా లేకుండా పోతుంది. ఎద్దేవా చేయండి కానీ ఎగతాళి చేస్తున్నారు’ అంటూ స్పీచ్ అదరగొట్టేశాడు. అలాగే తనపై వార్తా కథనాలు రాయడంపై ఎగతాళిగా మాట్లాడారు.

సెటైర్స్ బాగానే పేలాయి కానీ.. ఓ మూవీని హిట్, ఫెయిల్ అని తేల్చేది ప్రేక్షకుడు అన్న విషయాన్ని మరిచిపోయి.. మొత్తం తప్పును వెబ్ సైట్ దే అన్నట్లు మాట్లాడాడు. మాస్ మహారాజ్ అనగానే..ఎక్ట్ పెక్టేషన్స్ ఎలా ఉంటాయో సగటు ప్రేక్షకుడికి తెలుసు. సినిమా నచ్చితే.. ఎలాంటి వెబ్ సైట్ రాతల్ని, అది ఇచ్చే రేటింగ్‌ను పట్టించుకోరు ప్రేక్షకులు. ఎంత నెగిటివిటీ వచ్చినా.. మూవీ బాగుంది అన్న టాక్ వస్తే చాలు కచ్చితంగా హిట్ అందించే తీరుతారు.

అల్రెడీ ఆ విషయం చాలా సినిమాల విషయంలో ప్రూవ్ కూడా అయ్యింది. రాతల్ని పక్కన పెట్టి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎన్నో చిత్రాలు హిట్టే కాదూ సూపర్ హిట్టు కూడా కొట్టాయి. అంతే కానీ రివ్యూ, రేటింగ్స్, కామెంట్స్ కారణంగా మూవీ డిసైడ్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అని ఫీలవుతున్నారు జనాలు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker