Health

ఉప్పు ఎక్కువ తింటే మీ లైంగిక జీవితం నాశనమేనా..? అసలు విషయమేంటంటే..?

చాలామంది కేవలం రుచి కోసమే పలు వంటకాలను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా వరకు వంటకాలు ఏవైనా సరే.. ఉప్పు లేకుండా వాటికి రుచికాదు. తీపి పదార్థాలు పక్కన పెడితే మిగిలిన కూరలు, ఇతర ఏ వంటకంలోనైనా సరే.. ఉప్పు తప్పని సరిగా ఉపయోగించాలి. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సర్వ సాధారణంగా మారిపోయింది. ఒత్తిడి బారిన దాదాపుగా ప్రతి ఒక్కరూ పడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా లైంగిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.

పెరిగిన ఒత్తిడి స్థాయిలు అంగస్తంభన, లిబిడో లేకపోవడం, ఆనందం, ఉద్వేగం పొందడానికి ఎక్కువ సమయం, మగ , ఆడవారిలో సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తాయి. ఎలా అంటే ఒత్తిడి వల్ల హార్మోన్లు అసమతుల్యతకు గురవుతాయి, అంతేకాకుండా ఇది రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె సమస్యలు వంటి ఇతర జీవనశైలి రుగ్మతలు మీ వాస్కులర్ ఆరోగ్యంతో పాటుగా గుండె సామర్థ్యం, స్టామినాను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల లైంగిక రుగ్మతలు, అలసట, శక్తి తగ్గుతుంది. మీకు ఈ సమస్య ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించండి.

మందు తాగే అలవాటుందా..? అయితే మీ లైంగిక జీవితం గోవిందానే..!

అలాగే దీనిపై సలహా తీసుకోండి. మీరు క్రమం తప్పకుండా ఎక్కువ మొత్తంలో ఉప్పును తీసుకుంటే మీ లైంగిక ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఉప్పును ఎక్కువగా తింటే శరీరంలో సోడియం స్థాయి పెరిగి రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ఇది లిబిడో లోపాన్ని కలిగిస్తుంది. లిబిడో లేనప్పుడు లైంగిక కార్యకలాపాలపై మీకు ఆసక్తి బాగా తగ్గుతుంది. ఇది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రాసెస్ చేసిన శుద్ధి చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలను సాధ్యమైనంతవరకు నివారించండి. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

మంచి లైంగిక జీవితానికి కండోమ్స్ బెటరా..? లేదా పిల్స్ మంచిదా..?

రోజంతా మీ ఆఫీసు పనిలో బిజీగా ఉండటం, ఆ తర్వాత కూడా మీ భాగస్వామికి సమయం ఇవ్వలేకపోవడం కూడా మీ లైంగిక జీవితంపై ప్రభావం పడుతుంది. ఇది నెమ్మదిగా మీ లైంగిక జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఏ సంబంధంలోనైనా సాన్నిహిత్యం చాలా ముఖ్యం. అందుకే మీరు ప్రతిదానికీ ప్రాధాన్యతనిచ్చినట్టే మీ లైంగిక జీవితానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఇది మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. ఇది మీ సంబంధాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు మందుకు బానిసైనా లేదా రెగ్యులర్ గా ఎక్కువ మొత్తంలో బీర్, వైన్ వంటి ఇతర ఆల్కహాల్ ను తాగితే మీ లైంగిక జీవితంపై చెడు ప్రభావం పడుతుంది.

రోజూ మందును తాగడం వల్ల ఆడవారిలో లిబిడో తగ్గిపోయి శృంగారంలో పాల్గొనలేకపోతారు. దీంతో పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. దీంతో వారు లైంగిక కార్యకలాపాల సమయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాదు ఆల్కహాల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కూడా కాదు. ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ఇది మీ లైంగిక జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker