Health

పచ్చి బాదంపప్పు కూడా ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? ముఖ్యంగా గుండెకు..?

పచ్చి బాదంపప్పు కన్నా నానబెట్టినవే మంచివి. బాదంపప్పు తొక్కలో టేటిన్‌ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది పౌషకాలు మన శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. బాదంపప్పును నానబెట్టినప్పుడు తొక్కను వలిచేస్తారు కాబట్టి ఈ సమస్య ఉండదు. అయితే డ్రైనట్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక విట‌మిన్ ఇ, ఫైబ‌ర్, ప్రోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, జింక్, ఫాస్ప‌ర‌స్, మెగ్నిషియం వంటి అనేక రకాల పోషకాలను కలిగిన బాదం పప్పుల వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కాదు.

అయితే చాలా మంది ఎండిన బాదం పప్పులతోనే మేలు కలుగుతుందని భావిస్తారు. అందుకే వాటినే నానబెట్టుకుని తింటారు. కానీ పచ్చి బాదం పప్పులు కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరమే. పైగా పచ్చి బాదం పప్పును నానబెట్టకుండా నేరుగానే తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తి.. పచ్చి బాదంపప్పు తింటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పచ్చి బాదంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేసి, శరీరంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తాయి. గుండె ఆరోగ్యం.. పచ్చి బాదం గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అంతేకాక చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించి, శరీరానికి మేలు చేస్తాయి. జీవక్రియ.. పచ్చి బాదంపప్పులను తీసుకుంటే జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. ఇందులోని ఫైబర్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తాయి. ఎముకల బలం.. పచ్చి బాదంపప్పులోని ఫాస్ఫరస్, కాల్షియం ఎముకలని బలోపేతం చేస్తాయి.

బోలు ఎముకల సమస్యను దూరం చేసి, ఎముకల సాంద్రతను కూడా పెంచుతాయి. షుగర్ కంట్రోల్.. పచ్చి బాదంపప్పు తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్‌పై కంట్రోల్ సాధించవచ్చు. తద్వారా మధుమేహం కూడా మీ అదుపులో ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker