జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం. సాయం కోసం..?

పంచ్ ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్‌గా డయాసిస్ చేయించుకుంటున్నారు. చికిత్సతో కోలుకుని కొన్నాళ్లు జబర్దస్త్‌లో కనిపించారు. కాగా ఇప్పడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మరో జబర్దస్త్ కమెడియెన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న పంచ్ ప్రసాద్ కు చాలా మందే అభిమానులు ఉన్నారు.
అయితే ఆయన్ని గత కొంతకాలంగా కిడ్నీ సమస్య వేధిస్తోంది. పంచ్ ప్రసాద్ గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడు కిడ్నీ సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నాడు. దీనికోసం రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అయితే వైద్యంతో ప్రసాద్ ఆరోగ్యం కోలుకుని జబర్దస్త్ లో కనిపించినా మళ్లీ అతనిని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అతి త్వరలో ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు.
అందుకోసం ఆర్దికంగా సాయం కావాలంటూ తోటి నటుడు ఇమ్మాన్యుయేల్… అన్నకు సీరియస్ గా ఉంది ఉందంటూ పోస్ట్ పెట్టారు. ”అన్నకు సీరియస్ గా ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. మేం అంతా ట్రై చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను” అని ఇమ్మాన్యుయేల్ పోస్ట్ చేశారు. ఆయన పోస్టులో ప్రసాద్ భార్య సునీత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. దాతల నుంచి సాయం కోరుతూ ఈ పోస్ట్ చేశారు ఇమ్మాన్యుయేల్ గత ఏడాది నవంబర్ నెలలో ఓసారి ఆయనకు సీరియస్ అయ్యింది.
ప్రసాద్ కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఏకంగా నడవలేని స్థితికి చేరుకున్నారు. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిన ప్రసాద్ జ్వరంతో పాటు నడవలేక బాధపడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు పరీక్షలు చేసి కిడ్నీ సమస్య మరింత తీవ్రతరమైందని డాక్టర్లు చెప్పారు. నడుము వెనక వైపు చీము పట్టిందని వెల్లడించారు. అప్పుడు ఓ ఆపరేషన్ జరిగింది.
ఇందుకు ఆయనకు శస్త్ర చికిత్స చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య టీవీ ప్రోగ్రాంలలో ఆయన కనిపించారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్య సమస్యలు తిరగబెట్టినట్లు సమాచారం.