News

తల్లితండ్రులు పిల్లల ముందు ఎప్పటికి చేయకూడని కొన్ని పనులు ఇవే.

పిల్లలను పెంచటం అనేది అంత సులభం కాదు. తల్లితండ్రుల యొక్క ప్రతి చర్య మరియు ప్రభావాలు పిల్లవాడిని మనస్తత్వాన్ని మలుస్తుంది. పిల్లలు తల్లితండ్రులను అనుసరిస్తూ అనుకరిస్తారు. అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లల ప్రవర్తనను సరిచేయటానికి ప్రయత్నించడానికి ముందు, పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలాగా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం.

ఇది పేరెంటింగ్ చిట్కాలలో ఒకటి. అయితే క్రమశిక్షణా రాహిత్యం.. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణ రాహిత్యంతో అస్సలు ప్రవర్తించకూడదు. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే కాబట్టి, తల్లిదండ్రులు ఏ విధంగా మెదిలితే వారు కూడా అదే ఉదాహరణగా తీసుకొని మెదులుతూ ఉంటారు.

అబద్ధం చెప్పడం.. చాలామంది తల్లిదండ్రులు కొన్ని విషయాలను దాచడానికి అబద్దం చెప్పమని పిల్లలను అడుగుతారు. పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారంటే భవిష్యత్తులో కూడా దానికి ఎక్కువగా అలవాటు పడిపోతారు. తల్లిదండ్రులకు కూడా అబద్దాలు చెప్పడమే ప్రారంభిస్తారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తప్పుడు పదాలు మాట్లాడకూడదు.. సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటూ తప్పుడు పదాలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ఎక్కువగా పెద్ద వారి మాటలనే అనుసరిస్తారు కాబట్టి వాళ్ళు అవి నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. పిల్లల ముందు అవమానించ రాదు..దంపతుల మధ్య గొడవలు తలెత్తినప్పుడు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ దెబ్బలడుతూ ఉంటారు. ఈ సమయంలో భర్త భార్యను అవమానిస్తారు

అలాగే భార్య భర్తను అవమానిస్తుంది. ఇదంతా పిల్లల ముందే చేయడం వల్ల పిల్లలు కూడా అదే నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి భార్యభర్తలు ఒకరికొకరు గౌరవించుకోవాలి. అసభ్య ప్రవర్తన.. పిల్లల ముందే భార్య భర్తలు అసభ్యంగా ప్రవర్తించ కూడదు. అంటే వారి ముందే ఒకరినొకరు పట్టుకోవడం, ఇతరత్రా పనులు చేయడం లాంటివి చేయడం వల్ల పిల్లలకు కూడా అదే మైండ్ లో ఉండిపోతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker